ఆషాఢ గోరింట
ఆషాడ గోరింట
ఎరువు లేకుండా పండే పంట
ఎరువు తెచ్చుకున్నైనా అలంకరించుకునే పంట.
అదే అతివల చేతిపంట
ఆషాడపు గోరింట
నిద్ర చేయని గోరింట పండు మిరపలా పండునంట
అతి వల అరచేతిలో చుక్కల చంద్రుడిలా కనపడునంట.
మెరిసే చుక్కలు గోరింట ముద్దలై అరచేతిని అలంకరించు నoట
ఎర్రగా పండే గోరింట మగని ప్రేమకు చిహ్నం.
చుర్రుమనిపించే ఎర్ర మిరపలా పండితే
జవరాలి మదిని దోచే మొగుడువస్తాడని నమ్మకం.
అరచేతి అలంకరణతో ఊరుకోదు అతివ
సాయమడిగి మరీ అలంకరించుకుంటుంది గోరింటతో అరికాళ్ళని.
పండిన గోరింట తో మెరిసే జుట్టుకు అలంకారం.
వంటివేడిని తగ్గిస్తుంది అని చెప్పింది ఆయుర్వేదం.
ఆషాడం రాగానే గోరింట వైపు చూపుతుంది ప్రతి మగువ మొగ్గు.
గోరుముద్దలు తినిపించమని మొగుడిని అడగడానికి ఆమెకు లేదు సిగ్గు.
అతివలకు అలంకారం అంటే అంత మమకారం.
అరచేతులుకు గోరింట అలంకరణ మరింత అందం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి