నిజమైన కార్మికుడు
నిజమైన కార్మికుడు " వచ్చే నెలలోనే మన ప్రధాన కార్యాలయం నుంచి ఆడిటర్లు వస్తున్నారు. మన బ్రాంచ్ కి ఇన్స్పెక్షన్ టైం అయిపోయింది. ఏ క్షణమైనా రావచ్చు. మీరందరూ మీకు సంబంధించిన రికార్డులు అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ముఖ్యంగా రికార్డ్ రూము, బాత్రూం శుభ్రంగా ఉంచండి .ఇప్పటినుంచి ఎవరూ సెలవులు అడగడానికి వీల్లేదు అందరూ సమయానికి బ్రాంచ్ కి రావాలి రోజు కౌంటర్లు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. అంటూ ఆ బ్రాంచి యజమాని తన కింద ఉద్యోగస్తులకి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేసి ఎవరెవరు ఏ పనులు చేయాలో ఒక పుస్తకంలో వ్రాసి సంతకాలు తీసుకుని తన సీట్ లోకి వెళ్ళిపోయాడు ఆ బ్రాంచ్ మేనేజర్ సత్యా రావు. అప్పటినుంచి ఉద్యోగస్తుల గుండెల్లో రాయి పడింది. మామూలుగానే రోజు రాత్రి 10 గంటల వరకు బ్యాంకు లోనే సరిపోతుంది. ఇంకా ఈ ఆడిటోచ్చిందంటే చెప్పేదేముంది. ఆదివారాలు ఉండవు శనివారాలు ఉండవు జాతీయ సెలవు దినాలు ఉండవు. ఆ నెల రోజులు బ్యాంకు లోనే సరిపోతుంది అనుకుంటూ పెండింగ్ పనుల్లో మునిగిపోయారు ఆ బ్రాంచ్ సిబ్బంది. ఆ బ్రాంచ్ లో ఎవరి కౌంటర్ బాధ్యత వాళ్లకు ఉంటుంది కానీ అన్ని బాధ్యతలు తన నెత్తి మీద వేసుకునే వాళ్లు ఇద్దరే ఇద్దరు వ్యక్తు...