దసరా
మానవ జీవితానికి పండుగలు అంటే ఒక వరం. స్నేహితులు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండే రోజు పండుగ రోజు. ఒత్తిడితో నలిగిపోతున్న మానవ జీవితం ఆ ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండగలుగుతుంది. అన్ని మతాల వారు ఈ పండుగలు జరుపుకుంటారు. ఎవరి మతానుసారం వారికి ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. ముస్లిం మతస్తులకి రంజాన్ ప్రత్యేకమైన పండగ. అలాగే క్రైస్తవ సోదరులకు క్రీస్తు జన్మదినం అయిన క్రిస్మస్ ఒక పండుగ. హిందూమతస్తులకి ఉగాది మొదలు ప్రతినెలా ఏదో ఒక పండగ జరుపుకుంటారు. ఇది కాకుండా అమ్మవారి జాతరలు కూడా ఒక పండగలా చేసుకుంటారు. మొన్నటి వరకు గణేష్ నిమజ్జోత్సవాలు ఆనందంగా జరుపుకున్నాము. ఇక దసరా ఉత్సవాల సందడి మొదలైంది. మార్కెట్లో దసరా తగ్గింపు ధరల హోరు ప్రారంభమైంది. ప్రయాణాల సందడి మొదలైంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. దీన్నే దసరా పండుగ అంటారు. శరన్నవరాత్రులు అని కూడా అంటారు. శరదృతువులో వచ్చే పండుగ దసరా. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి భగవంతుడు వివిధ రూపాల్లో అవతారాలు ఎత్తేవాడు. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి త్రిమూర్తులు సృష్టించిన శక్తి స్వరూపం దుర్గామాత. శివుడు ను...