పోస్ట్‌లు

నడిచే దేవుడు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నడిచే దేవుడు

నడిచే దేవుడు ఉదయం 11 గంటలు అయింది  బ్యాంక్ అంతా రద్దీగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఒక కుగ్రామంలో ఉన్న ప్రముఖ జాతీయ బ్యాంకు శాఖ అది. ఇంత మారుమూల గ్రామంలో కూడా బ్యాంకు పెట్టారా! అని ఆశ్చర్యపోతారు ఎవరైనా చూస్తే. ఖాతాదారులు ఎవరు బయట నుంచి రారు. అంతా ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉండేవాళ్లే. అయితే ఆ గ్రామం ఆర్థికంగా చాలా బలమైన గ్రామం ఆ జిల్లాలో.  ప్రభుత్వం వారి పథకాలకి అనుగుణంగా బ్యాంకులు కూడా అతి సామాన్యులకు కూడా ఖాతాలు ఇవ్వడంతో దేశంలో ఏ బ్యాంకుకైనా విపరీతమైన రద్దీ పెరిగింది. ముఖ్యంగా డ్వాక్రా గ్రూపు మహిళలతో బ్యాంకులో ఏవి ఖాళీ ఉండటం లేదు. అలాగే ఆ ఊరు బ్యాంకు కూడా.  ఇంతలో ఒక తెల్ల లుంగీ పంచి పట్టుకుని పైన షర్టు వేసుకొని నుదురుతున్న బొట్టు పెట్టుకుని చేతిలో బ్యాంకు పాసుబుక్ పట్టుకుని హడావుడిగా వచ్చిన వ్యక్తిని తన గదిలోంచి సీట్లో కూర్చున్న మేనేజర్ రాఘవరావు సబ్ స్టాఫ్ ను పిలిచి ఆ వ్యక్తిని లోపలికి తీసుకురమ్మన్నాడు. ఇంతలో ఎదురు గుండా కూర్చున్న అంతే వయసు గల వ్యక్తి అదే బ్రాంచ్ కి కొత్తగా మేనేజర్ గా ఛార్జ్ తీసుకుంటున్న రామారావు   " ఎవరండీ ఆయన అని అడిగాడు రాఘవరావుని. మ...