నా రథం
పుట్టడం అందరి బిడ్డలులాగే అమ్మ కడుపున. ఎవరి దిష్టో పోలియో శాపo పసిప్రాయంలో. మానవుడి జీవిత గమనం రెండు కాళ్ళతో. నా జీవిత గమనానికి మూడు కాళ్లు . అందుకే నేను ప్రత్యేకం. దాని తోటే నా జీవితం. అదే మూడు చక్రాల రథం. దేవుళ్ళు ప్రతి పండక్కి రథంలో ఊరేగింపు నేను నారథoతో పాటు ప్రతి చోట విహరింపు. ప్రతి ఆశయానికి గమనం ముఖ్యం నా ప్రతి ఆశయ సిద్ధికి నా రథం నా అదృష్టం. నా బిడ్డలు నా రథానికి వెనకుండే చక్రాలు. ముందుండి నడిపించే ముద్దుల చక్రం భార్య . కుటుంబ సభ్యులు నా మార్గదర్శకులు. బతుకు జట్కా బండి కాదు. రాజధాని express రైలే. మూడు చక్రాల రధం ఎంతో పరోపకారి. నా అభివృద్ధికి ఎంతో ఉపయోగకారి. నా లాగే బండి కూడా సహనం ఎక్కువ. పనిభారం పెరిగనా పల్లెత్తు మాట్లాడను వయసుతో పాటు నా భారం పెరిగిన కిమ్మనకుండా గమ్యం చేరుస్తుంది నా బంగారు రథం. న...