పోస్ట్‌లు

సాగరం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సాగరం

సముద్రపు నీళ్లన్నీ ఉప్పుమయం గొంతు దింపాలి అంటే భయం. భూభాగంలో మూడొంతులు జలభాగం. అయినా మనిషికి తీరటం లేదు దాహం. ఉప్పు నీళ్ళు అయినా అది జలమే పంచ భూతం లో అది లెక్క లోనే పంచభూత పరమార్ధం పరోపకారార్ధం ఇదం శరీరం చేపల పులుసు అంటే లొట్టలేసుకుని తింటాం. జలధి నుంచి పుట్టిందే కదా ఆ ఆణిముత్యం. నీళ్ల మీదే కదా బెస్త వారి బతుకు పోరాటం. జలరాసులే కదా వారి కాసుల పంట. కెరటాలే కదా సాగరానికి అందం వచ్చే కెరటం పోయే కెరటం మన జీవితంలో కష్టం సుఖం తో సరి సమానం అయినాతరతరాలుగా సాగుతూనే ఉంది సాగరం. మనిషి నేర్చుకోవాలి మరింతగా ముందుకు సాగడం.  సాగరఘోష బూడిదలో పోసిన పన్నీరు. ఆర్చే వారు ఉండరు తీర్చే వారు ఉండరు. అయినా సాగరం ప్రయత్నం ఆపదు.  అదే కదా మనిషికి స్ఫూర్తి. సాగరానికి ఏమి తెలుసు తన ఘోష   ఒక స్వరకారుడి స్వరమై నంది పతకాలు అలంకరించుకుందని. ఒక కవికి మహాకావ్యమై పద్మశ్రీలను అందుకుoదని. అవార్డులు తెచ్చిపెట్టిన ఒక సినిమాకు పేరు సముద్రం. బండి నడవాలంటే ఇంధనం కావాలి. ఇంధనంతోటే మరింత ధనం దేశానికి. అగాధం నుంచి ఇంధనం మనకందరికీ వరం. మన చమురు వాయువుల సంస్థ దేశానికే గర్వకారణం. నిత్యంమన సముద్రుడికి చెయ్యాలి ...