జీవితం
 నీటి బుడగ జీవితం. ఎప్పుడు చితికి పోతుందో  ఎవరికి తెలుసు. చావు బతుకుల మధ్య కాలమే జీవితం. పగలు రాత్రి ప్రతిమనిషికీ సమానం. సగ భాగం అంతా తిండి నిద్రకి  సరిపోతుంది. బాల్యమంతా నీ జీవితం గురించి నీకు అవగాహన  ఉండదు. యవ్వనం నుండి నీ అసలు జీవితం ప్రారంభం అవుతుంది.  ఇంకో జీవి కూడా నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ జీవి కూడా జీవితం అంటే అంత వరకు తెలియదు. అమ్మా,నాన్న ,పుస్తకాలు ,కాలేజీ, హాస్టల్ జీవితం బాధ్యతలు లేని బతుకు ఇంతవరకు  అనుభవించిన  తీపి గుర్తులు. ఇంకొకరి తో జీవితం ఒక ఫ్రేమ్ లో ఉంటుంది.  ఒకరి బాధ్యతలు ఒకరు పంచుకోవడం. ఒకరి కోసం ఒకరు బతకడం. తన ఇష్టాలను త్యాగం చేయడం కూడా తప్పదు. సర్దుబాటే జీవితం. సరే జీవితంలోకి అడుగు పెట్టాం. జీవిత సాఫల్యo ఏమిటి. డబ్బు పిల్లలు వృద్ధాప్యం ఈ మూడింటి తోటి మనకు చిక్కులు వస్తాయి. మన ఆనందంగా జీవించడానికి డబ్బు కావాలి.  డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. చేసిన పనికి ప్రతిఫలమే జీతం.  జీతం తో జీవితం ఆనందంగా గడపడమే . అప్పనంగా వచ్చేది లంచం. లంచం పంచ రంగుల జీవితం చూపిస్తుంది. కానీ దైవం ఎప్పుడూ మనం గమనిస్తూనే ఉంటుంది. పరుల సొమ్ము ఆశించక పోవడమే పరమార్ధం. గౌతమ్ ...