జీవ నది
నేను ఒక జీవనదిని. నేను మీకు తెలియని దాన్ని కాదు. మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం వద్ద పుట్టాను. జలజల పరిగెడుతూ నిజాంబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాలోని ప్రజలను పంటపొలాలను పలకరించి తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది వద్ద నా తల్లి ఒడిలో చేరుతున్నా ను. నేను ధవళేశ్వరం వద్ద ఏడు పాయలుగా చీలి సప్త ఋషుల పేర్లు పెట్టుకున్నాను. నాకు చాలా పౌరాణిక చరిత్ర ఉంది. పూర్వకాలంలో గౌతమ మహర్షి గోహత్య పాతక నివృత్తి కోసం శివుని మెప్పించి గంగను భూమి మీదకు తీసుకు వస్తారు. ఆ గంగయే గోదావరి నది. గౌతమీ నది అని కూడా పిలుస్తారు. మీ ఇంటిలో జరిగే ప్రతి శుభ అశుభ కార్యక్రమాలు నేను లేకుండా ఏదీ జరగదు. పచ్చగా ఉండే మీ పంట పొలాలను నిత్యం నేను పలకరిస్తూనే ఉంటాను.. జలజలా పారుతూ అంతర్వేదిలో కలిసిపోతున్న...