ఇడ్లీ
ఇడ్లీ ఆకాశంలోని చందమామ వంటి మేను. పరిపూర్ణబింబము వంటి మోము. అల్పాహారములో మణిహారము పరభాషలో ఇడ్లీ అచ్చ తెలుగులో వాసిన పోలు. రసముతో చెలిమిచేసి రసాగ్రమునకు రుచితెచ్చు. అల్లపు చట్నీతో ఆరగించినచో అరుగుదలకు సహకరించు చక్కెరతో కలిపి చంటి బిడ్డకు రుచి చూపించినచో మాటిమాటికి మారు అడుగు బక్క చిక్కిన జనులకు వాసిన పోలుగా మేలు చేయు. కారప్పొడి నంజుకుంటే నాలుక నాట్యము చేయు. ఆహా ఇది తెలుగువారి ఫలహారము. తెలుగు భాష అంత కమ్మదనం. ఆలికి చమట పట్టకుండా చేయు పలహారం. ఎంత మధురం తెలుగువారి అల్పాహారమునకు మణిహారం. రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279