పోస్ట్‌లు

మే 6, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

వివాహం

అహమును అణచుకొని అహర్నిశలు పెళ్ళిలో చేసిన ప్రమాణం మననం చేసుకుని రతీమన్మదుల వలె శృంగార రస రాజ్యము పాలించిన వివాహం అనగా భువి లో వెలసిన స్వర్గమే కదా.

పోరాటం

తెల్లవారి లేస్తే జీవన పోరాటం ప్రారంభం. కొందరికి ఇల పైన పోరాటం మరికొందరికీ కడలే జీవనరణరంగం . వల చేతపట్టుకుని వలపులు అణచుకొని ఏటికి ఎదురు ఈదడమే నిత్యకృత్యం. నిత్యం బ్రతుకు వేట కోసం ఆరాటం. చేపల పులుసు నోటికి బానే ఉంటుంది. వల వేసి పట్టే బెస్త వారి కష్టం ఎవరికి తెలుసు. ప్రాణం పణంగా పెట్టే బ్రతుకు పోరాటం వారిది. ఏ అల ఏ నిమిషంలో ముద్దాడుతుందో తెలియని నడి సంద్రంలోని పోరాటం. కడలి కరుణిస్తే వల నిండా జలపుష్పాలు. జలధి అల్లకల్లోలం అయితే తనువు నిండా పుష్పగుచ్ఛాలు. కడుపు శోకాలు అనంతాలు అలకి వలకి మధ్య జరిగే జీవన పోరాటం రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.          కాకినాడ 9491792279

మాయ

భువనమంత నోటిలో చూపించే బాలకృష్ణుడు బిడ్డగా ఒడిలో చేరితే ముద్దు మురిపం చేయకుండా తరిమి తరిమి కొట్టే తల్లికి తెలియలేదు విష్ణుమాయ. తల్లి రూపంలో వచ్చిన రక్కసి పూతన రక్తం పీల్చి హతమార్చిన బాలకృష్ణుడి మాయ . అల్లరి ఆగడాలు భరించలేక రోలుకి బందీ చేయబడిన లోకేశ్వరుడు గంధర్వులను బంధ విముక్తులను చేసిన  అల్లరి కృష్ణుడు మాయ. కాళింది మడుగులో కాళీయుడు పై నృత్యం చేసిన తాండవ కృష్ణుడు మాయ. వేణు గానముతో మంత్రముగ్ధులను చేసిన వేణుగోపాలుడి మాయ. చిటికెన వేలితో గిరిని ఎత్తి ప్రళయకాలంలో  రేపల్లె వాసులను కాపాడిన గిరిధరుడి మాయ. గురుపుత్రుని బతికించి గురుదక్షిణగా సమర్పించిన శిష్యుడు మాయ. వస్త్రాపహరణ సమయంలో ఎలుగెత్తి పిలిచిన ద్రౌపదిని అవసరమైనది ఇచ్చి కాపాడిన కృష్ణ మాయ. ఉపనిషత్తుల సారాంశం గీతగా బోధించి అర్జునుడిని యుద్ధోన్ముఖుని చేసిన గీతా కృష్ణుడి మాయ. దేవాది దేవుడి తల్లి కే సాధ్యం కాలేదు విష్ణు మాయ ని తెలుసుకోవడం. అజ్ఞానాంధకారంలో ఉన్న మానవులకు ఎలా తెలుస్తుంది భగవంతుడి మాయ. జరిగిన ప్రతి సంఘటన కనపడని భగవంతుడు మాయ. మౌనంగా కర్మసిద్ధాంతాన్ని నమ్మడమే మానవుల కర్తవ్యం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు. ...