పోస్ట్‌లు

ఏప్రిల్ 13, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆయుర్వేదం

నాడి తడిమి చూసి నలత చెప్పు కళ్ళలో కళ్ళు పెట్టి రక్త బలిమి చూడు రసాగ్రము రంగు చూసి రోగము సంగతి చెప్పు. ఆయుష్షును వృద్ధిచేసి ఆరోగ్య మిచ్చేది ఆయుర్వేదం రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.           కాకినాడ 9491792279

కబ్జా

కబ్జా " చూడ్డానికి చాలా విశాలంగా ఉంది. మూడు బెడ్ రూములు హాలు, కిచెన్ ,డైనింగ్ హాలు ,రెండు బాల్కనీలు, రెండు బాత్రూములు మనకి శుభ్రంగా సరిపోతుంది. మనం ఆ బిల్డర్ తో మాట్లాడి ఏదో విధంగా తీసుకుందాం. మంచి గాలి వేస్తోంది. మంజీరా వాటర్ వస్తుందిట. మార్కెట్ కూడా చాలా దగ్గర. పైగా ఆ ఏరియా కు దగ్గర్లో మెట్రో స్టేషన్ కూడా వస్తుంది ట. బిల్డర్ కూడా చాలా మంచి వాడ నీ పైన ఉన్నవాళ్లు చెబుతున్నారు. ఈరోజు మార్కెట్ రేట్లు ని బట్టి ఆ రేటు ఏమి ఎక్కువ కాదు. మొదటి అంతస్తు అయితే మనకి లిఫ్ట్ పని చేయకపోయినా ప్రాబ్లం లేదు అంటూ చెప్పిన భార్య శాంత మాటలుకి ఆలోచనలో పడ్డాడు రామారావు.  రామారావు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ గా పని చేస్తూ ఉంటాడు.చాలా రోజుల నుంచి అద్దె ఇంట్లో ఉంటూ పిల్లలతో సరిపోక ఇబ్బంది పడుతుంటాడు. ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తుంటే భయం. వాళ్లకు పడుకోవడానికి ఇల్లు సరిపోదు. దానికి తోడు ప్రతి ఏటా అద్దె పెంచడంతో ఎన్నో ఇళ్ళు మారిపోవాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి ఆ నగరంలో. ఇప్పటివరకు రామారావు ఆ నగరంలో ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోయాడు. కొన్ని ధర ఎక్కువగా ఉండి కొన లేకపోతే, మరికొన్ని ఆ ప్...

అవ్వ మళ్లీ పుట్టింది

అవ్వ మళ్ళీ పుట్టింది. కాలకూట విష o. ఈ పేరు తలుచుకుంటేనే వెన్నులోంచి వణుకు  పుట్టుకొస్తుంది. ఒళ్ళు జలదరిస్తుంది. పాలసముద్రంలో నుంచి పుట్టింది గాని ఏ ప్రాణి జీవితాన్ని అయినా క్షణంలో బుగ్గిపాలు  చేస్తుంది ఈ కాలకూట విషం .అటువంటి హాలాహలాన్ని గొంతులోనే బంధించాడు ఆ త్రినేత్రుడు. విచిత్రం చూడండి భగవంతుడు గొంతులో ఉన్న విష o బయటకు వదిలితే లోకానికి ప్రమాదం. సామాన్య మానవుడు విషం మింగితే ఆఖరి చుక్క వరకు బయటకు వచ్చేవరకు విశ్వ ప్రయత్నం చేస్తారు వైద్యులు. లేకపోతే ఆ మనిషి మనుగడకు ప్రమాదం.  మానవ శరీర నిర్మాణంలో గొంతు అనే భాగానికి ఉన్న ప్రాముఖ్యత చాలా ఎక్కువ. తీసుకున్న ఆహారాన్ని కడుపులోకి పంపించి మనిషి మనుగడకు చాలా సహాయం చేస్తుంది ఈ గొంతు. ఒక్కొక్కసారి తీసుకున్న ఆహారం పడక గొంతు బొంగురు పోతుంది. గొంతులో ఏదో అడ్డు పడినట్లు ఉంటుంది. అయితే ఆ బాధ నుండి విముక్తి పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం.  ఇంతకీ ఈ సమస్య గొంతుకు సంబంధించినదా. కాదు గొంతులో దాగున్న సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న శరీర భాగం. మామూలుగా పైకి కనపడదు కానీ మానవ శరీరానికి అది అతి ముఖ్యమైన శరీర భాగం. అటువంటి శరీర భాగం...

పాండవుల మెట్ట

పాండవుల మెట్ట కాకినాడ జిల్లా పెద్దాపురం చారిత్రాత్మకంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న పట్టణం. ఒకప్పుడు ఇక్కడ పట్టు బట్టలు నేసే చేనేత పని వారు ఉండేవారు. అది పెద్దాపురం సిల్క్ గా ప్రసిద్ధి చెందింది. అయితే సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అనేక యంత్రాలతో తయారైన వస్త్రాలతో ఇవి పోటీ పడలేక మరుగున పడిపోయేయి. అయితే ఈ గ్రామంలో ఉన్న మరొక విశేషం మరిడమ్మ అమ్మవారి గుడి. ఆషాడ మాసంలో ఒక నెలరోజుల పాటు జరిగే తీర్థానికి అమ్మవారి జాతర్లకి చుట్టుపక్కల గ్రామాల నుండి ఎంతోమంది భక్తులు వచ్చి తమ మ్రొక్కులు తీర్చుకుంటారు. అలాగే ఇక్కడ ఒక సూర్యనారాయణమూర్తి దేవాలయం కూడా ఉంది.  ఆధ్యాత్మికంగా పెద్దాపురం ఈరకంగా ప్రాముఖ్యత సంతరించుకుంటే చారిత్రాత్మకంగా కూడా పెద్దాపురం చరిత్రలో నిలిచిపోయింది. అదే పాండవుల మెట్ట అనే స్థలం. ఇది మహాభారత కాలంలో అజ్ఞాతవాసo సమయంలో పాండవులు నివసించిన ప్రదేశంగా ప్రజలు విశ్వసిస్తారు. దానికి తగినట్లుగా కొన్ని ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి. వాటిని పాండవుల గుహలు అంటారు. పూర్వకాలంలో పెద్దాపురం నుంచి రాజమండ్రి వరకు సొరంగ మార్గం ఉండేదని అది ప్రస్తుతం మూసి వేయబడిందని చెప్తుంటారు. అలాగే ఈ కొం...