పోస్ట్‌లు

నిశ్శబ్ద లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నిశ్శబ్ద వీరుడు

  నీ గెలుపుకోసం   ఎన్నోసార్లు నేనే ఓడిపోయాను —   మన సంసార సమరంలో   బాధ్యతగల భర్తగా నిలిచాను. కన్నబిడ్డల కలలన్నీ   నా భుజాలపై మోసుకుంటూ,   నాన్నగా నా జీవితాన్ని   నిశ్శబ్ద త్యాగంగా మార్చుకున్నాను. కుర్చీకి అతుక్కుపోయిన రోజులు,   పని గంటలు మరిచిన రాత్రులు,   రక్తపోటు పెరిగినా   కుటుంబ సంతోషమే ఔషధమైంది. ఎవరూ చప్పట్లు కొట్టలేదు, ఎవరూ గాథలు రాయలేదు; అయినా ప్రతి ఇటుకలో నా చెమట ఉంది, ఈ ఇంటి ప్రతి వెలుగులో నా శ్వాస ఉంది. ఇంతకీ నేనెవరు? పేరులేని త్యాగాల మధ్య నిశ్శబ్దంగా జీవించే వాడిని కాదు — తుఫాన్లను ఆపే తీరం, చీకట్లను తట్టుకునే దీపస్తంభం, కూలిపోకుండా కుటుంబాన్ని నిలబెట్టే అదృశ్య బలాన్ని. నేను సగటు మగవాడిని కాదు… ప్రేమను బాధ్యతగా మోసే ఒక నిశ్శబ్ద వీరుడిని రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

నిశ్శబ్దమైన ప్రేమ

నిశ్శబ్దమైన ప్రేమ ఏ జన్మలో ని రుణానుబంధమో ఆ స్థావరంలో నాకు ఇంత చోటు కల్పించింది . ఆ స్థావరం నా ఉనికికి ఆధారమైంది. ఆ దుర్భేద్యమైన కోట చుట్టూ తిరుగుతూ చిమ్మ చీకటిలో గర్భస్థ నరకాలన్ని అనుభవిస్తూ ఎవరో తెలియని దాత అందించిన అమృతాన్ని చప్పరిస్తూ, ఎవరో అజ్ఞాత దాత ప్రసాదించిన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నెలకొకటి చొప్పున స్వీకరిస్తూ అలుపెరుగని సైనికుడి లాగా నిత్య సమరం చేస్తుంటే నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు నీ లోకం వేరు అంటూ మాయాలోకం నుండి మన లోకంలోకి తీసుకొచ్చి పడేసి ఇదిగో నా రూపం అంటూ దేవుడు నన్ను చూపించి ఆనందపరిచాడు మా బంధువుల్ని, స్నేహితులని.  నేను కడుపులో పడినప్పుడు నేను ఒక రకంగాను అమ్మ ఒక రకంగానూ బాధ అనుభవించి నరకాలన్నీ చూసాము. నవనాడులు బిగబట్టి పురిటి నొప్పులు భరించి ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ లోకంలోకి నన్ను తీసుకురావడం అమ్మకి నరకమే. అలా భూమి మీద పడ్డ నాకు ఇన్నాళ్లు అమృతo అందించిన అన్నపూర్ణ నాకు అమ్మ అయింది. అమ్మ నుంచి వచ్చినవే నాకు బంధుత్వాలన్నీ. నాకు తొలి బంధువు అమ్మ.   తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పెరిగిన నేను అమ్మ ఒకరినొకరు చూసుకోలేదు. నా రూపం తెలియదు నా రంగు తెలియదు...