అతిధి
అతిధి అతిధి రాగానే సాదరంగా ఆహ్వానిస్తాo ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ల చెంబు అందిస్తాo భుజం మీద తుండు అందిస్తాo లోపలికి ఆహ్వానించి కుర్చీ వేపు చేయి చూపిస్తాo నవ్వుతూ కుశల ప్రశ్నలు వేసి కాఫీ గ్లాసు అందిస్తాo పవర్ కట్ ను మరిపించేలా తాటాకు విసనకర్రతో విసురుతూ మాటామంతి మంచి చెడ్డ ఉభయకుశలోపరి. మధ్యలో ఓ గ్లాసు మజ్జిగ. మళ్లీ కబుర్ల ప్రవాహం అనుబంధాల ప్రహసనం బంధువులందరి వాకబు స్నేహితుల గురించి సమాచారo పిల్లల చదువు సంధ్య. కష్టం సుఖం కన్నీళ్లు ఇట్టే జరిగిపోతుంది కాలం కాళ్ళు కడుక్కోండి వేళయింది అంటూ వంటింట్లోనుంచి ఆహ్వానం. మడి కట్టు కోవడానికి ఎర్రటి పట్టు పంచ సిద్ధం తాతల నాటి టేకు కర్ర పీట పీట ఎదురు గుండా పరిచిన తోటలోని అరటి ఆకు ఆకు పక్కనే మర చెంబుతో నీళ్ళు వడ్డన ఆరంభం. తాతలనాటి మామిడి చెట్టు కాయ వేయించిన కందిపప్పు. వెరసి పప్పు మామిడికాయ. కోనసీమ కొబ్బరి పచ్చడి అరటికాయ కూర అరటి దూట పచ్చడి కోనసీమ అరటిపండు పంటి కింద గుమ్మడి వడియం. తీపి ముక్కల పులుసు మధ్యలో దుంప తగిలితే అదుర్స్ రుచికోసం కొత్తావకాయ లు మారు అడిగితే మహదానందం. కొసరి కొసరి వడ్డన. గడ్డపెరుగు లోకి చెరుకు రసం మామిడి పండు. ఆప్యాయతతో ...