పోస్ట్‌లు

ఉత్తరం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఉత్తరం

ఉత్తరం  " ఏమిటి ! సాంబయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చి అప్పుడే పదిహేను రోజులు అయింది. ఏమీ తోచట్లేదు .కబుర్లు తెలియట్లేదు . ఎప్పుడూ వారం రోజులకోసారి ఉత్తరం రాసేవాడు అనుకుంటూ పోస్ట్ మాన్ కోసం ఎదురుచూస్తూ మాటిమాటికి గుమ్మం వైపు తొంగి చూస్తోంది కావమ్మ. ఉత్తరం చదివితే సాంబయ్య ను చూసినట్టు ఉంటుంది కావమ్మకి. సాంబయ్య తో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఆ రోజుల్లో కావమ్మ లాంటి వాళ్ళు ఎందరో! మళ్లీ ఉత్తరం వచ్చేవరకు ఆ ఉత్తరంలోని సంగతులతో మనసు బెంగ పెట్టుకోదు. ఏంటో ఈసారి చాలా లేట్ అయింది అనుకుంటూ గదిలో మూలగా ఉన్నతీగకు తగిలించుకున్న పాత ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించింది. మొదటి వాక్యం లో గౌరవం, ప్రేమ మొదలైంది . ఎడం చేతపక్క తల పైకెత్తి చూస్తే దాని వయసు ఎంతో తెలిసిపోయింది. మీకోసం ఆ ఊరి నుంచి కబురు మోసుకొచ్చాను అని చెప్పింది.   క్షేమమాచారాలతో మనసు కుదురుపరచి అక్కడి నుంచి ఆ ఊరి ఊసులన్నీ చెబుతూ ప్రేమ పొంగిస్తూ బాధలను తెలియ చేస్తూ అమ్మ మీద బెంగ ని ప్రకటించే కబుర్లన్నీ తనలో దాచి తలపై మీద ముద్ర వేయించుకుని వచ్చిన తోకలేని పిట్ట ఈ కార్డు ముక్కని చదివి కన్నీళ్లు కార్చింది కావమ్మ.  ముగింపులో...

ఆఖరి ఉత్తరం

ఆఖరి ఉత్తరం ఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది. పది రోజుల నుండి బంధువులతోటి పిల్లలతోటి కర్మకాండలతోటి హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో ఇల్లు బోసిగా ఉంది.  ముప్పై ఐదు సంవత్సరములు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవి విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న రామారావు మాస్టారు కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది పిల్లలందరూ రామారావు మాస్టర్ రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరు ఇ ళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. ఇక మిగిలింది లంక అంత కొంప భార్య పార్వతమ్మ. పిలిస్తే పలికే నాధుడే లేడు. ఈ శేష జీవితం ఎలా గడపాలని ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.  కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు గాని కన్నతల్లి ఎలా బ్రతుకుతుందని ఆలోచన ఏ ఒక్కరికి లేదు. అమ్మ వెళ్లి వస్తాo అంటూ పిల్లలు వెళ్లిపోయారు . అంతా కలలా జరిగిపోయింది. భర్తకు భార్య భార్యకు భర్త ఒకరికొకరు తోడు. ఒకరి ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఎవరు తోడు అనుకుంటూ కళ్ళనుండి అప్రయత్నంగా కళ్ళు నీళ్లు జారాయి. ఇంతలో పోస్ట్ అని కేక...