పోస్ట్‌లు

బామ్మ కోరిక లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

బామ్మ కోరిక

" ఒరేయ్ రాజు బజార్ నుంచి వచ్చేటప్పుడు ఆ మెయిన్ రోడ్ లో ఉన్న కోటయ్య కాజా తీసుకురారా. చాలా రోజులైంది తిని. మీ నాన్న బ్రతికున్న రోజుల్లో వారానికి ఒకసారైనా తీసుకొచ్చేవారు అంటూ బయటికి వెళ్లబోతున్న కొడుకు రాజారావు గారితో హాల్లో మంచం మీద కూర్చున్న 75 ఏళ్ల కామేశ్వరమ్మ గారు చెప్పారు. మీరు ఏమి తీసుకురాకండి ఆవిడకి అసలే షుగర్ . ఏదైనా రోగం వస్తే నేను చేయలేక చావాలి అంటూ కోడలు వసంత వంటింట్లోంచి గట్టిగా అరిచింది.  "ఒరేయ్ కోడలు మాటలకి ఏమి లేరా! ఏదో నామీద ప్రేమ కొద్ది అలా చెప్తుంది. నేను ఇవాళ ఎలాగైనా ఆ కోటయ్య కాజా తినవలసిందే .అబ్బా తలుచుకుంటేనే నోరూరిపోతోంది. పొట్ట నిండా పాకంతో పొట్టిగా చూడముచ్చటగా ఉంటుంది. ఎక్కువ పట్టరాకు. పిల్లలు ఎవరూ తినరు. కోడలుకి స్వీట్ ఇష్టం ఉండదు. ఇంట్లో మనిద్దరమే స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళం. అంటూ కొడుకుతో చెప్పింది కామేశ్వరమ్మ గారు. అలాగే అమ్మ పట్టుకొస్తానంటూ బయటకు వెళ్ళిపోయాడు రాజారావు గారు. ఇదేమిటి అమ్మ ఇలా రోజుకో తినుబండారం అడుగుతోంది. మొన్న ఆఫీస్ పని మీద సామర్లకోట వెళ్తున్నాను అమ్మ అంటే ఒరేయ్ అక్కడ గవ్వలు ప్రసిద్ధి రా కాసిని పట్టుకొద్దు అంటూ షాప్ అడ్రసు కూడా చెప...