పోస్ట్‌లు

జూన్ 3, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

సహాయం

జీవితం క్షణ భంగురం అంటారు. ఒక్క క్షణం కాలం నిడివి గల జీవిత సంఘటనలు కొన్ని మనకి కనువిప్పు కలిగిస్తాయి. మనిషి గా ఉండవలసిన బాధ్యత గుర్తు చేస్తాయి. సమాజంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి. కానీ స్పందించే హృదయాలు కొన్నే ఉంటాయి. అవసరమైనప్పుడు ఆదుకోవడం అనేది అందరికీ చేతకాదు. ఎంతసేపు డబ్బు చుట్టూ పరిగెత్తే మనిషి తన చుట్టుపక్కల చూడడం మానేశాడు.  చుట్టుపక్కల చూడరా చిన్నవాడా అని సిరివెన్నెల వారు అమృతమైన మాటలు చెప్పిన బాలు గారు గొంతులో ఆ పాట ఆనందంగా విని అర్థం మరుగున పడేసారు జనం ఆ పాట సంగతి అలా ఉంచి మనం కథలోకి వెళ్ళిపోదాం. అవి కరోనా దేశాన్ని కుదిపేస్తున్న రోజులు. రోడ్డుమీద ఎక్కడ జనసంచారం కనబడే వారు కాదు కానీ ఆసుపత్రిలోనూ  మందుల షాపుల దగ్గర బాగా రద్దీగా ఉండేది. అన్ని మందుల షాపుల్లాగా ఆ మందుల షాపు దగ్గర కూడా రద్దీ ఎక్కువగా ఉంది. మందుల కోసం వచ్చినవాళ్లలో రకరకాల వయసులో వాళ్ళు ఉన్నారు. అందులో ఒక 10 సంవత్సరాల పాప చేతిలో బ్యాగు, మందుల చీటీతో వచ్చి నిలబడి ఉంది ఇంతలో ఒక వృద్ధుడు చేతిలో కర్ర పట్టుకుని నడుస్తూ ఒక మందుల చీటీ మందుల షాపు యజమాని చేతులో పెట్టాడు. ఆ ముసలాయనకి వయస్సు 70 ఏళ్ల వరకు ఉండొచ్చు. వ...

మా పల్లె దీపావళి

అది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని మారుమూల పల్లెటూరు. ఊరు మారుమూలన ఉన్న ప్రజల మనసులు ఆత్రేయ గోదావరి అంత విశాలం. గోదావరి జలాలంత స్వచ్ఛమైన హృదయాలు. బంధాలకి బాంధవ్యాలకి ఉమ్మడి కుటుంబాలకి ఎక్కువ విలువను ఇచ్చే గ్రామం. మామూలుగానే ఎప్పుడు వచ్చే పోయే బంధువులతో పిల్లలతో కళకళలాడుతూ ఉండేది ఆ గ్రామంలోని అగ్రహారం. ఇంకా పండగలు వస్తే చెప్పాలా.               ఇంతకీ ఆ ఊరి పేరు ఏమిటో చెప్పలేదు కదూ. అదేనండి పల్లిపాలెం గ్రామం. ఏ పండగ వచ్చినా ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉండేది .అయితే దీపావళి పండక్కి దీపాలు తెచ్చే వెలుగుతో పాటు ప్రతి ఇంట్లోనూ తయారు చేసే బాణసంచా వెలుగులు చాలా ముచ్చటగా ఉండేవి. కన్నులకు ఆనందాన్ని ఇచ్చేవి. ఈ గ్రామంలో సుమారు 50 సంవత్సరాల క్రితం ప్రతి అరుగు మీద బాణసంచా తయారు చేసేవారు. తారాజువ్వలు ,చక్ర కాయలు, నల్ల మందు తో తయారుచేసిన టపాకాయలు ,చిచ్చుబుడ్లు , పిచ్చుకలు ,మతాబులు సిసింద్రీలు . సుమారు నెలరోజులు దగ్గరుండి వీటి తయారీకి ప్రయత్నాలు ప్రారంభించేవారు.. ఇంటి పెద్దలు వీటి తయారీలో చాలా మంచి నైపుణ్యం సంపాదించి ఉండేవారు. కుర్ర కారు సిసింద్రీలు తయారు చేసేవార...