బాలు మళ్లీ జన్మించు
ముగ్దమోహన రూపం. పాటంటే ప్రాణం. భాషలో ఉచ్చారణకే ప్రాధాన్యం. భావం పలికించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పుట్టింది పండితారాధ్యుల వంశం. ఏ నోములు నోచిందో తల్లి శకుంతలమ్మ ఆ ఇంట్లో నారద తుంబురులే జన్మించారు బాలుడుగా. ఆరాధించే త్యాగరాజస్వామి కొడుకుగా పుట్టాడు ఆ సాంబయ్య గారింట్లో. చిన్నతనంలో సాంబయ్య గారి ఇంట్లో జరిగిన సాహిత్య గోష్టులు విని బాలసుబ్రమణ్యం గారికి భాష పట్ల అభిమానం పెరిగింది. నాటకాల పట్ల మమకారం పెరిగింది. పాడాలనే కోరిక పెరిగింది. కళాశాల విద్య స్థాయి దాటి సాంకేతిక విద్య నేర్చుకోమంటే సరిగమల వైపు మొగ్గు చూపిందా గళం. పుట్టింది ఎక్కడో నెల్లూరు జిల్లాలో అయినా తన గొంతులో ఒకటా రెండా 40 వేల పాటల పాడి విశ్వం అంతటికి చిరపరిచితుడు అయ్యాడు మన బాలసుబ్రమణ్యం. ఆరాధ్య గాయకుడయ్యాడు. భాషతో నిమిత్తం లేదు. ఎన్ని భాషలలో పాటలు పాడాడో లెక్కలేదు. ప్రతి దేవాలయము బాలు గొంతులోని సుప్రభాతం తోటే భక్తి పాటల తోటే తలుపులు తెరుచుకుంటాయని చెప్పడం అతిశయోక్తి కాదు. ఒక మతమునకు సంబంధించిన పాట అయినా ఒక భాషకు సంబంధించిన పాట అయినా ఆయన గొంతులో అది సుస్వరాల మూట. అది అనుకరణ అంటే అనుకరణ కాదు. చలన చిత్రంలో నటించే న...