తీర్థ యాత్ర
తీర్థయాత్ర ఉదయం ఆరు గంటలు అయింది షిరిడి వెళ్లే సాయి నగర్ ఎక్స్ప్రెస్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో వచ్చి ఆగింది. ఎప్పటినుండో షిరిడి వె డదామనుకున్న భాస్కరరావు కుటుంబ సభ్యులందరి తోటి S7 బో గిలో స్లీపర్ క్లాస్ లో అడుగు పెట్టాడు. బెర్త్ నంబర్లు చూసుకుని సామాన్లు సర్దుకుని ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. ఎన్నాళ్లనుంచో షిరిడి వెళ్దామనే కోరిక బాబా గారు ఇప్పటికి తీర్చుతున్నారని మనసులోనే బాబా గారికి నమస్కారం చేసుకుని కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాడు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లోనే బోగి అంతా నిండిపోయింది. కాకినాడ నుంచి షిరిడి వెళ్లే ఏకైక రైలు ఇదొక్కటే. మర్నాడు ఉదయం 9:00కు కానీ సాయి నగర్ అంటే షిరిడి చేరుకోలేరు. అయినా అందరూ ఈ రైలుకే బుక్ చేసుకుంటారు. భాస్కర్ రావు కాకినాడలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో చిరు ఉద్యోగి. షిరిడి సాయిబాబా భక్తుడు. ప్రతి లక్ష్మీవారం కాకినాడ అశోక్ నగర్ లోని బాబా గుడికి వెళ్లి వస్తుంటాడు. బాబా గారి ఆజ్ఞ లేనిదే శిరిడీలో అడుగు పెట్టలేమనే బాబా చెప్పిన మాటలు కచ్చితంగా నమ్మి ఆ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అనుకోకుండా పిల్లలందరికీ సెలవులు ఇవ్వడం రెండు...