పోస్ట్‌లు

మా ఊరు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మా ఊరి జ్ఞాపకం

చూడ్డానికి క్రికెట్ వీరుడులా, పొట్టిగా గవాస్కర్ లా ఉండేవాడు మా వెంకన్న. ఆ గవాస్కరు ఎప్పుడు చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే, ఈయన నోట్లో పొగాకు చుట్ట — చేతిలో ఎప్పుడు పదమూడు ముక్కల పేక పట్టుకుని ఉండేవాడు. లుంగీ, పంచ కట్టుకుని, దానిమీద చొక్కా తొడుక్కుని, నోట్లో చుట్ట పెట్టుకుని ఉదయమే లేచి సైకిల్ ఎక్కాడంటే — ఏ అరుగుదగ్గర ఆగుతాడో ఎవరికీ తెలిసేది కాదు. అరుగు దగ్గర ఆగాడంటే భాగవతం, భారతం, రామాయణం వినడానికి కాదు. ఈయన పారాయణం వేరే ఉంది. అదే చతుర్ముఖ పారాయణం. --- అందరూ సంక్రాంతి పండుగకి, పెళ్లిళ్లకి, వేసవికాలం సెలవులకి పేకాట ఆడడం మామూలే ఆ ఊర్లో. కానీ మన వెంకన్న 365 రోజులు అదే ప్రవృత్తి. వృత్తి వ్యవసాయం అంటాడు. ఎప్పుడు పొలం గట్టు ఎక్కిన పాపాన పోలేదు. తలపాగా చుట్టిన సందర్భం చూడలేదు. “ఏవండీ వెంకన్న గారు ఉన్నారా ఇంట్లో?” అంటూ మూడు వందల అరవై ఐదు రోజులలో ఎప్పుడు ఎవరు అడిగినా — “లేదండి, పేకాటలో ఉన్నారండి” అని ఇంట్లోంచి అదే సమాధానం. అదేదో పెద్ద ఉద్యోగం లాగా చెప్పేవారు. చివరికి ఏ వీధిలో ఉన్నాడు, ఎవరు అరుగు మీద ఉన్నాడు వెతుక్కుని ఆ వచ్చిన పెద్దమనిషి తన పని పూర్తి చేసుకునేవాడు. ఆ ఊర్లో నాలుగైదు అరుగులు ప్...

నగరంలో మా ఊరు

నగరం లో మా ఊరు  ఆదివారం ఉదయం ఎనిమిది గంటలు అయింది. వాలు కుర్చీలో పడుకుని తీరిగ్గా పేపర్ చదువుకుంటున్నారు రామారావు మాస్టారు. ఇంతలో పక్కన రింగ్ అవుతున్న మొబైల్ ని తీసి ఎవరిదో నెంబర్ అని చూశాడు. అమెరికా నుంచి డాక్టర్ శేఖర్ ఫోన్. రామారావు మాస్టర్ దగ్గర పదవ తరగతి వరకు చదువుకున్నాడు. చిన్నప్పటినుంచి చదువులో బాగా తెలివితేటలు ఉన్న శేఖర్ అంటే రామారావు మాస్టా రు కి చాలా అభిమానం. అందుకే ప్రత్యేక శ్రద్ధతో శేఖర్ కి చదువు చెబుతూ ఉండేవాడు ఒక ట్యూషన్ మాస్టర్ గా. పదవ తరగతి తర్వాత శేఖర్ ఇంటర్మీడియట్ లో బైపీసీ తీసుకొని డాక్టర్ కోర్స్ చదివి పై చదువులకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు శేఖర్  శేఖర్ ది రామారావు మాస్టర్ ది ఇద్దరిదీ ఒకటే ఊరు. అది కోనసీమలోని చిన్న పల్లెటూరు. మాస్టారికి ఆ ఊరు అంటే చాలా ఇష్టం. మాస్టర్ కి మొక్కలంటే చాలా ఇష్టం . ఇంటి చుట్టూ పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయ ముక్కలు పెంచుతూ ఉండేవారు మాస్టారు. ఎప్పుడూ పిల్లలకి ఆ మొక్కల మధ్య కుర్చీ వేసుకుని చాప మీద పిల్లలను కూర్చోబెట్టుకుని చదువు చెప్తుండేవారు. మాస్టారి ఇల్లు ఒక గురుకులంలా అనిపించేది పిల్లలకి. ఆ తర్వాత వయసు మీద పడడంతో మా...