చినుకు రాలాలి
చినుకు రాలాలి " బయట అంత ఎండ గట్టిగా కాస్తుంటే వర్షాలు పడతాయని చెప్తున్నారు ఏంటండీ అంటూ అడిగింది ఒక భార్య ఒక భర్తని టీవీలో వార్తలు చూస్తూ! వేసవికాలంలో వర్షాలు ఏమిటి? కలికాలం కాకపోతే ను. మా చిన్నతనాల్లో గాలి దుమ్ములు వచ్చేవి. పెద్దగా గాలి వచ్చి తోటల్లో ఉండే మామిడికాయ లు రాలిపోయేవి. పిల్లలందరం తోటల్లోకి పరిగెత్తుకుని వెళ్లి చెట్టు కింద పడిన మామిడికాయలు ఏరుకుని తట్టలో పెట్టుకుని పట్టుకొచ్చే వాళ్ళo. అదొక వింత అనుభూతి. మర్నాడు ఎండ చాలా దారుణంగా ఉండేది అంటూ ఒక ముసలాయన తన అనుభవాల పరంపరలోకి వెళ్లిపోయాడు. టీవీ వాళ్ళు వార్తలు ఏమీ ఆధారాలు లేకుండా చెప్పరు. వాతావరణ పరిశోధన శాఖ వాళ్లకి ఇచ్చిన సమాచారం ఆధారంగా చెబుతారు. చూస్తూ ఉండండి కాసేపట్లో వర్షం పడుతుంది అన్నాడు ఇంటి యజమాని. ఊరుకోండి ఊరగాయలు కూడా ఎండలో పెట్టాను. అలా చెబుతారు ఏమిటి ? అంటూ కోపంగా ఇంట్లోకి వెళ్లిపోయింది ఒక ఇల్లాలు. అప్పటికి ఉదయం తొమ్మిది గంటలు అయింది. పిల్లలు స్కూల్ కి పెద్దల ఆఫీసులకి తయారవుతున్నారు. సడనుగా వాతావరణ శాఖ చెప్పినట్లుగా నీలిరంగు ఆకాశం ముఖం మార్చుకుని నల్లగా తయారైపోయింది. ఆకాశంలో నుంచి మంచు ముక్కలు ఊడి పడినట్లు...