పోస్ట్‌లు

కన్నీరు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కన్నీరు

గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖం జల జలమంటూ కళ్ళు వెంట కన్నీరు మనిషి కళ్ళవెంట చెప్పే తన భావం కన్నీళ్లు. ఆనందంతో వచ్చే కన్నీళ్లు ఆనంద భాష్పాలు. ప్రతి జీవికి కన్నీళ్లు దేవుడిచ్చిన వరం కన్నీళ్లే రాకపోతే కఠినాత్ముడు అని నామకరణం. మనసులో భావం చెప్పే గొప్ప సంకేతం. బిడ్డ కంట కన్నీరు అమ్మకే తెలుసు. పసివాడి భావం కన్నీటితోనే తెలుపు. మాట వచ్చేవరకూ అమ్మకి కన్నీటి తోనే సంకేతం ఇచ్చు. మనసులోని భావo చెప్పడానికే భాష పసివాడి భాషే కంట వెంట కారే నీరు బిడ్డకు అమ్మకి మధ్య వారధి కన్నీళ్లు. బట్ట తడిసింది ఏమో అని అమ్మ గుడ్డలకోసం వెతుకు. డొక్క చూసి బిడ్డను గుండెలకు హత్తుకొను. చుక్క గొంతు దిగగానే అమ్మను చూసి బిడ్డ నవ్వు. ఆ బొమ్మకి తెలుసున్న భాష కన్నీళ్లే కదా. మూగ జీవి కన్నీళ్లు ఆదరించే రైతుకే తెలుసు లేగదూడ అంబా అనే అరుపుతో పాలికాపు దాని కట్లు విప్పు. దూడ పొదుగు వెతుకు అమ్మ ఆత్రంగా నాలికతో నాకు. మూగజీవుల బాధ బ్లూక్రాస్ వారికే తెలుసు. ప్రియుడి వెతలు ప్రియురాలికే తెలుసు. ఎదురుచూపులన్ని కళ్ళ వెంట కన్నీరుగా కారు. ప్రతి జీవికి కన్నీళ్ల రుచి తెలుసు. ఉప్పు నీళ్లు అయితేనేం గుండె బరువు దించు. మబ్బు పట్టిన మేఘం వర్షమై కురి...