సీతమ్మ అన్నదానం
ఉదయం పదకొండు గంటలు అయింది. ఆ నగరంలో ప్రముఖ కూడలి ఉన్న గుడి ముందు ఇద్దరు బిచ్చగాళ్లు కూర్చుని ఉన్నారు. ఇంతలో గుడి తలుపులు మూసేసి పూజారి గారు బయటకు వచ్చి, "ఏరా ఇంకా వెళ్ళలేదా?" అని అడిగారు. ఎందుకంటే ఉదయం–సాయంకాలం గుడిమెట్ల మీద ఆ ఇద్దరు బిచ్చగాళ్లు సుమారు ఇరవై సంవత్సరాల నుండి భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఉదయం–సాయంకాలం గుడి దగ్గర బిక్షాటన చేసుకుని, గుడి కట్టేసిన తర్వాత ఎదురుగా ఉన్న చెట్టు దగ్గర, రాత్రి పూట పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ మెట్ల మీద పడుకుంటారు. ఆ నగరంలో అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ వాళ్లు వేరే గుడి దగ్గరకు వెళ్లలేరు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ప్రమాదవశాత్తు కాళ్లు ఒక యాక్సిడెంట్‌లో పోయాయి. ఎవరో పుణ్యాత్ములు ఇచ్చిన మీద మూడు చక్రాల బండి వాళ్ళకి ఆధారం. పూజారి గారు అడిగిన ప్రశ్నకి "లేదండి" అంటూ సమాధానమిచ్చి, ఏదో నసుగుతూ కనబడ్డారు బిచ్చగాళ్లు. రోజు పదకొండు గంటలకే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ బిచ్చగాళ్లు. ఇవాళ ఇంకా ఎందుకు అక్కడ ఉన్నారని అప్పుడు తట్టింది పూజారి గారికి. విషయం అర్థమైంది రా! మీరు ఎవరి గురించి ఎదురు చూస్తున్నారో! ఆ అమ్మగారి గురించే కదా… అవునన్నట్లుగ...