ఆ రోజుల్లో
ఉదయం ఎనిమిది గంటలు అయింది. నిండా పదేళ్లు కూడా లేని మనవరాలు "అమ్మ స్కూలుకు టైం అయిపోతోంది ! అని ఊరికే తొందర పెడుతుంది. వంటింట్లో చెమటలు కక్కుతున్న నా కూతురు వస్తున్నా ఉండవే! బయటికి గబగబా వచ్చి బాత్రూంలోకి పిల్లల్ని లాక్కుపోయింది. కాసేపు పిల్ల ఏడుపు తల్లి సముదాయింపు వెరసి తయారైన పిల్లనీ తీసుకుని తల్లి బయటికి వచ్చింది. ఆ కాన్వెంట్ విద్యార్థిని చూస్తే ఆశ్చర్యమేసింది! స్కూలు యూనిఫామ్, మెడలో టై, స్కూల్ బ్యాడ్జి, కాళ్లకు బూట్లు సాక్సులు చేతికి స్కూల్ బ్యాగ్ , బ్యాగులో బరువైన పుస్తకాలు, పెన్సిల్లు రబ్బరు ఇరేజర్ పెట్టుకోవడానికి ఒక చిన్న పెట్టే, క్యారేజీ కి ఒక సంచి, నిండా నీళ్లతో ఒక వాటర్ బాటిల్, మధ్యలో స్నాక్స్ ఇది స్కూలుకు వెళ్లే విద్యార్థి అవతారం. ఆ స్కూల్ బ్యాగ్ పైన రకరకాల బొమ్మలతో చాలా ఆకర్షణీయంగా ఉంది. " స్కూల్ బ్యాగ్ చాలా బాగుంది అన్న నా ప్రశంసకి సమాధానంగా మా అమ్మాయి ఏముంది నాన్న ప్రతి ఏటా కొత్త బ్యాగు కొనడమే అంది. మొత్తానికి తల్లి, పిల్ల నోట్లో అన్నం కుక్కి ఏదో మాయ మాటలు చెప్పి సందు చివర స్కూల్ బస్సు ఎక్కించి వచ్చింది. మా అమ్మాయి మొహం లో ఎంతో రిలీఫ్ కనబడింది. ఇంతకీ అది చదివ...