పోస్ట్‌లు

ఆ ఊరు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆ ఊరు

 ఆ ఊరు మన జీవన యాత్రలో ఎన్నో ఊర్లు తిరుగుతూ ఉంటాం. పుట్టినఊరు , చదువు కోసం వెళ్ళిన ఊరు, పొట్ట చేత పట్టుకుని తిరిగే ఊరు, అత్తవారి ఊరు అందులో ముఖ్యమైనవి.  పుట్టిన ఊరు స్వర్గంతో సమానం అంటారు. మనం పుట్టిన ఊరు తలుచుకున్నప్పుడల్లా నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులు, గడిచిపోయిన బాల్య మధుర స్మృతులు, బంధువులు, స్నేహితులు గుర్తుకు వస్తూనే ఉంటారు. అది సహజమే. పుట్టినప్పటినుంచి ఆ గాలి ఆ నీరు ఆ వాతావరణం ఆ మనుషులు తో మమేకమై కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి. అక్కడ ఉండేది కొద్ది రోజులే కానీ మన జీవితం ఆ కాలేజీ , స్నేహితుల మధ్య తిరుగుతుంది. జీవితంలో ఆ ఊరి పేరు తలుచుకున్నప్పుడల్లా మన విద్యార్థి జీవితం గుర్తుకొస్తుంది. మరి ఉపాధి కోసం మనం వెళ్లిన ఊర్లు జీవితంలో చాలా మధుర జ్ఞాపకాలు మిగులుస్తాయి. కష్టాలు కూడా ఉంటాయి లెండి.ముఖ్యంగా కొన్ని వృత్తుల వాళ్ళు అంటే అక్కడ ఉండే ప్రజలతో సంబంధం ఉండే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రజలతో అనుబంధం పెరుగుతుంది. ఉదాహరణకి గవర్నమెంట్ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు వీరికి నిత్యం అక్కడ ఉండే ప్రజల తోటే మమేకమై పని చేస్తుంటారు.  కానీ మన జీవన సమరంలో మనకి మధ...

ఆ ఊరు

ఆ ఊరు. "  ఊరు ఎంత మారిపోయింది. శుభ్రమైన తారు రోడ్లు వేశారు. ఒకప్పుడుపూరి పాకలు బంగాళా పెంకుల ఇల్లులు ఉండే వీధులన్నీ అందాలభవంతులతో మెరిసిపోతున్నాయి.  ఒకప్పుడు ఆ ఊరికిరావాలంటే గుర్రo బండి లేదంటే ఎడ్ల బండి తప్ప రిక్షా కూడా వచ్చేది కాదు. ప్రతి వేసవి కాలంలో అమ్మ నేను తమ్ముళ్లుఎంతో కష్టపడి ఆ ఊరు వచ్చేవాళ్ళం. వేసవి కాలంలో ఎందుకు వచ్చేవాళ్ళం? అది మా సొంత ఊరు కాదు. మా అమ్మ పుట్టింటి వారి ఊరు. నేను పుట్టిన ఊరు. నా జన్మభూమి అన్నమాట. సెలవులు ఇవ్వగానే తాతయ్య నుండి ఆహ్వానం అందేది.  నేను అమ్మ నా నలుగురు తమ్ముళ్లు అందరం కలిసి హైదరాబాదు నుండి వచ్చేవాళ్ళo. పాపం తాతయ్య ఊర్లో కొద్దిగా వ్యవసాయం చేసుకుంటూ సొంత ఇల్లు , ఆవులు గేదెలతో పాల వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు.  అంత పెద్ద ఆస్తిపరుడు కూడా కాదు. కానిపాపం ఎనిమిది మంది సంతానం. అందరినీ డిగ్రీ వరకు చదివించి పెళ్లిళ్లు పేరంటాలు చేశాడు. ఇక వేసవికాలం వచ్చిందంటే కూతుళ్లు కొడుకులుమనవల తోటి ఆ ఇల్లు కళకళలాడిపోయేది.  ఆ ఊర్లో ఇంచుమించుగా పెద్ద ఇల్లు మా తాత గారిది అని చెప్పొచ్చు. ఇంటి ముందు పెద్ద పందిరి సంవత్సరం పొడుగునా ఉండేది.గుమ్...