పోస్ట్‌లు

ప్రణాళిక లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ప్రణాళిక

ప్రణాళిక ఈ సమస్త జీవకోటిలో ఆలోచించే శక్తి, ఆలోచన ఆచరణలో పెట్టే శక్తి ఒక్క మనుషులకే ఉంది. ప్రతి ఒక్కరికి నిత్యజీవితంలో అనేక రకాలైన లక్ష్యాలు ఉంటాయి. చేయవలసిన పనులు ఉంటాయి. ఈ పనులను లేదా లక్ష్యాలను సాధించడానికి ఒక క్రమబద్ధమైన పద్ధతి అవసరం. ఆ పద్ధతిని ప్రణాళిక అంటారు. ఆంగ్ల భాషలో planning అంటారు. నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఏ పని మొదలుపెట్టిన అది సఫలీకృతం అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రణాళికంటే ఒక వ్యూహం. ఒక ఆలోచన. ఒక నిర్దిష్టమైన ఊహలతో కూడిన కొత్త మార్గం. ఉదాహరణకి ఏదో విమాన ప్రయాణం చేయవలసి వస్తుంది మహానగరాల్లో ఉండేవాళ్లు ఆ విమానాశ్రయం చేరుకోవడానికి ఒక గంట సమయం పడుతుంది అని అనుకుందాం సాధారణంగా అయితే అక్కడున్న ప్రధాన సమస్య ట్రాఫిక్ వలన ఇంకొక గంట ముందుగా బయలుదేరాలి. అంటే ప్రయాణ సమయం రెండు గంటలుగా ఊహించుకోవాలి . ఆ ఊహ ప్రణాళిక. ఒకవేళ ట్రాఫిక్ జాం వలన కొంచెం ఆలస్యం అయినప్పటికీ నిర్ణీత సమయానికి మనం అక్కడికి చేరుకోగలం.  లేదంటే అనవసరమైన ఒత్తిడి కంగారు అనారోగ్యం కోపాలు తాపాలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం ఇవన్నీ జరిగిపోతాయి. ఇదంతా అనవసర రాద్ధాంతం.  దూర ప్రాంతాల్లో ఉండే ...