పోస్ట్‌లు

పగటి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పగటి వేషగాళ్లు

పగటి వేషగాళ్ళు.  " ఏరా పోచయ్య దసరా దగ్గరికి వచ్చేస్తోంది. ఎప్పటిలాగా నువ్వు పులి వేషం వెయ్యాలి. నువ్వు చేసినట్లుగా పులి డాన్స్ ఎవరు చేయలేరు. రోజుకి ఎంత ఇమ్మంటావు?. కచ్చితంగా చెప్పు మనం రేపే బయలుదేరాలి !అంటూ చెప్పిన కాంట్రాక్టర్ రంగయ్య మాటలకి " రోజుకు ఐదు వందలు ఇప్పించండి. రెండు పూటలా భోజనం. సాయంకాలం కాస్త ఒక గ్లాసు మందు. ఖరీదైంది అక్కర్లేదు లెండి. ఎప్పటిలాగా సత్రంలోనే కదా పడుకోవడం అంటూ సమాధానం ఇచ్చిన పోచయ్య మాటలకి రంగయ్య చాలా ఎక్కువ చెబుతున్నావు. ఇదివరకు ఇచ్చినట్లుగా ఇస్తాను అన్నాడు రంగయ్య.  " అయ్యగారు కిట్టటం లేదు. కూలి పనికి వెళ్తే రోజుకి ఎనిమిది వందల రూపాయలు ఇస్తున్నారు. దానికి తోడు వయస్సు పెరిగిపోతుంది కదా కాళ్ల నొప్పులు మొదలయ్యే యి. దానికి తోడు ఆ ఊరి జనం నేను పులి వేషంలో కనబడితే ఊరికే ఉండనీరు. డాన్స్ చేయమంటారు. అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా కాళీ ఉండదు అంటూ చెప్పాడు పోచయ్య.  సరే రా రేపు రెడీగా ఉండు . ఉదయం బస్సు కే బయలుదేరాలి.  అంటూ చెప్పిన రంగయ్య మాటలకి తల ఊపేడు పోచయ్య. రంగయ్య రాజమండ్రిలో చిన్న చిన్న నటులను సప్లై చేసే కాంట్రాక్టర్ . అలాగే ఒక షాప్ యజమాని కూడ...