పోస్ట్‌లు

కాలామా లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కాలమా నీకు జోహార్లు

కాలమా నీకు జోహార్లు ఏ సమస్య లేకుండా సాఫీగా నడిచిపోతే జీవితం ఎందుకు అవుతుంది? జీవితమంటే సమస్యల పోరాటం. తెల్లారి లేస్తే ఏదో ఒక సమస్య. ఒక సమస్య సాఫీగా తీరిపోయిందనుకుంటే మళ్లీ ఏదో ఒకటి . ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికి తెలుసు. ఆ మార్పు మంచిదైతే చెప్పుకోవడానికి ఏముంది. చెడు జరిగింది కాబట్టే ఈ కథ   లంకంత కొంప ,నాలుగు తరాలకు సరిపడే డబ్బు ,భర్త పిల్లల డాక్టర్ , కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి అమెరికాలో స్థిరపడిపోయిన అమ్మాయి రమ , భాగ్యనగరంలో సొంత ఫ్లాట్ లో భార్యతో కాపురం ఉంటున్న కొడుకు అర్జున్. చేతిలో మూడు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు సంగీత శాస్త్రంలో ప్రావీణ్యమే కాక పాక శాస్త్రం లో ప్రావీణ్యం. పేరులక్ష్మి రూపం మహాలక్ష్మి డాక్టర్ రామ శాస్త్రి గారికి ఇంటి ఇల్లాలు.మరి ఇంతకీ సమస్య ఏమిటి ?మూడు సంవత్సరాలుగా అనారోగ్యంగా ఉన్న డాక్టర్ రామశాస్త్రి గారు అకస్మాత్తుగా కన్నుమూశారు. ఈ హఠాత్పరిణామానికి ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. పది రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఇంటి నిండా జనం ఉంటే కొంత ధైర్యం ఉండేది. పిల్లలు సెలవు లేదంటూ ఎవరు ప్రదేశాలకు వాళ్ళు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ లంకoత...