పోస్ట్‌లు

పెళ్ళి చూపులు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పెళ్ళి చూపులు

పెళ్లిచూపులు తెనాలి సంబంధం వాళ్లు ఫోన్ చేశారు  అమ్మాయిని చూసుకోవడానికి రేపు ఆదివారం బయలుదేరి వస్తున్నామని అంటూ రామారావు గారు ఆఫీస్ నుండి వచ్చి భార్య సంగీతకి విషయం చెప్పి వాలు కుర్చీలో కూలబడ్డాడు. ఆదివారం అంటే నాలుగు రోజులే ఉంది అంటూ చేతిలో కాఫీ గ్లాస్ భర్తకి  ఇచ్చి ఎదురుగా ఉన్న  కుర్చీలో కూర్చుంది. ముందుగా అమ్మాయికి ఫోన్ చేయాలి అని చేయవలసిన పనులు ఏర్పాట్లు  భర్తతో విపులంగా చెప్పింది. రామారావు గారు అన్ని విషయాలు వివరంగా విని బయటికి వెళ్లి వస్తానని చెప్పి అలా బజార్లోకి వెళ్ళిపోయాడు. రామారావు గారు  ఒక ప్రభుత్వ ఉద్యోగి.  చాలా చాందస భావాలు ఉన్న వ్యక్తి .రామారావుకి ఇద్దరు పిల్లలు. పిల్లలు ఇద్దరినీ చాలా క్రమశిక్షణతో పెంచాడు.అమ్మాయి లలిత హైదరాబాదులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. అబ్బాయి రఘు హైదరాబాదులో బిటెక్ చదువుతున్నాడు. లలితకి పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి. లలిత మంచి అందమైన అణుకువ కలిగిన పిల్ల . వరుడు పవన్ కుమార్  బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. మంచి కుటుంబం మంచి ఉద్యోగం అని మధ్యవర్తి ద్వారా ఫోటోలు జాతకాలు పంపించడం జరిగింది. పిల్ల ఫోటో నచ్చింది. జాతకా...