పోస్ట్‌లు

అరటి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అరటిపండు

అరటిపండు మేని చూడ పసుపు పచ్చగా ఉండు తొక్క తీసి చూడ చందమామ వలె నుండు అమ్మ రంగు చూడ ఆకుపచ్చగా నుండు కొరికి చూడ తియ్యగా నుండు.  ఆకుతో జత కట్టి పండు తాంబూలమగు.  శివయ్య పూజలో చేరి నైవేద్యంగా మారు  అగరబత్తికి ఆసరా ఇచ్చి పరువు నిలబెట్టు పూజలో ప్రసాదమై భక్తుల నోటికి చేరు. ఆటల్లో అరటిపండు కాదు ఆకులోని అరటిపండు ఏ కాలపు విందుకి అయిన అదే కింగ్. విందు భోజనపు విస్తరిలో కనువిందు చేయు గడ్డ పెరుగు రుచి మరింత పెంచు బక్క చిక్కిన జనులకు బలిమి పెంచు పండులోని ఖనిజం రక్తపోటుని తగ్గించు. ముడతలపడ్డ మొహానికి వెలుగునిచ్చు వెరసి అరటిపండు అంటే పేదవాడి ఆపిల్ పండు. మందు కొట్టి పసుపు పచ్చగా మార్చి అరటిపండు పరువు తీయు చున్నారు కలిజనులు. రంగు భ్రమలో పడి మందు మింగి పొట్ట చేత పట్టుకుని పరుగులు పెట్టుచున్నారు జనులు. ఏమి చెప్పను కదళీఫలము మహిమలు. పుడమి తల్లి ముద్దుబిడ్డ లీలలు. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు           కాకినాడ 9491792279