ఆశ్రయం
ఆశ్రయం. " ఎలాగైనా కుంభమేళాకు వెళ్లి వద్దాం అండి. మన బంధువులందరూ వెళ్లి వస్తున్నారు. అందరూ మన వయసు వాళ్లే .నాకెందుకో చూడాలని కోరిక బలంగా ఉంది. ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు అంటూ కుంభమేళా ప్రారంభం అయ్యే రోజుకు ముందు ఒక నెల రోజుల నుంచి వసంత రోజు పోరు పెడుతూనే ఉంది " అంత జన సమర్థంలో మనం వెళ్ళగలమా! దానికి తోడు భాష రాదు. ఇంటర్నెట్లో చూస్తుంటే అన్ని హోటల్స్ ఖాళీ లేవు. వసతి దొరకడం చాలా కష్టం. మనం చాలా ఇబ్బంది పడాలి. ఏదో తిప్పలపడి టిక్కెట్లు సంపాదిస్తాను కానీ. అక్కడ వసతి లేకుండా ఎలాగా. సామాన్లు ఎక్కడ పెడతాము. కనీసం ఒక గంట అయినా విశ్రాంతి తీసుకోవాలి కదా. అలసిపోయి ఉంటాం అన్నాడు వసంత భర్త రాజశేఖర్. ఆ కుంభమేళ ఉత్సాహంలో వసంత రాజశేఖర్ మాటలు ఏమీ పట్టించుకోకుండా మొత్తానికి రాజశేఖర్ నొప్పించి ఒప్పించి హైదరాబాదు నుంచి కాన్పూర్ వరకు ఫ్లైట్ ఎక్కి అక్కడి నుంచి రైలులో ప్రయాగ స్టేషన్ లో దిగారు. రైలు ప్రయాణంలో రిజర్వేషన్ బోగి జనరల్ బోగీ ఒకే విధంగా ఉన్నాయి. అందరూ భక్తులే. అందుకే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కువ నిబంధనలు పాటించకుండా భక్తుల్ని మొత్తానికి ప్రయాగ స్టేషన్ కి చేరవేశార...