పోస్ట్‌లు

అక్టోబర్ 10, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

ఉత్తరం

" ఏమిటి ! సాంబయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చి అప్పుడే పదిహేను రోజులు అయింది. ఏమీ తోచట్లేదు .కబుర్లు తెలియట్లేదు . ఎప్పుడూ వారం రోజులకోసారి ఉత్తరం రాసేవాడు అనుకుంటూ పోస్ట్ మాన్ కోసం ఎదురుచూస్తూ మాటిమాటికి గుమ్మం వైపు తొంగి చూస్తోంది కావమ్మ. ఉత్తరం చదివితే సాంబయ్య ను చూసినట్టు ఉంటుంది కావమ్మకి. సాంబయ్య తో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఆ రోజుల్లో కావమ్మ లాంటి వాళ్ళు ఎందరో! మళ్లీ ఉత్తరం వచ్చేవరకు ఆ ఉత్తరంలోని సంగతులతో మనసు బెంగ పెట్టుకోదు. ఏంటో ఈసారి చాలా లేట్ అయింది అనుకుంటూ గదిలో మూలగా ఉన్నతీగకు తగిలించుకున్న పాత ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించింది. మొదటి వాక్యం లో గౌరవం, ప్రేమ మొదలైంది . ఎడం చేతి పక్క తల పైకెత్తి చూస్తే దాని వయసు ఎంతో తెలిసిపోయింది. మీకోసం ఆ ఊరి నుంచి కబురు మోసుకొచ్చాను అని చెప్పింది.   క్షేమమాచారాలతో మనసు కుదురుపరచి అక్కడి నుంచి ఆ ఊరి ఊసులన్నీ చెబుతూ ప్రేమ పొంగిస్తూ బాధలను తెలియ చేస్తూ అమ్మ మీద బెంగ ని ప్రకటించే కబుర్లన్నీ తనలో దాచి తలపై మీద ముద్ర వేయించుకుని వచ్చిన తోకలేని పిట్ట ఈ కార్డు ముక్కని చదివి కన్నీళ్లు కార్చింది కావమ్మ.  ముగింపులో కూడా మదిని...

సోడా

చిత్రం
 సోడా  గరళాన్ని గొంతులో దాచి గరళకంఠుడయ్యాడు శివుడు. రంగురంగుల గోళాన్ని గొంతుకి అడ్డుగా పెట్టుకుని గోలి సోడా నయ్యాను. శివుడు గరళాన్ని వదిలేస్తే జగమంతటికి ప్రమాదం. నా గొంతుకు అడ్డం పడిన గోళీ నా ప్రాణం. నా ఉనికికి అదే ఆధారం. మాది విడదీయలేని బంధం. ఒకప్పుడు సర్వకాల సర్వావస్థల యందు మీకు ప్రాణ స్నేహితుడునీ. విందులో ,మందులో తప్పకుండా హాజరయ్యే అతిధిని. పీకలు దాకా తిన్నవాడికి కడుపు బరువుని డొక్కమాడుతున్న వాడికి దాహం తీర్చే చౌక రకం పానీయాన్ని. ఎంతోమందికి ఉపాధినిచ్చేదాన్ని. సోడా కొట్టులు షోకు మార్చుకుని షోకేసుల్లో మెరిసిపోయే సీసాలు పెట్టుకుని నా పొట్ట కొట్టేసారు. పట్టణాలలో పల్లెల్లో నాలుగు మూలలా దొరికే బంగారాన్ని. ఇప్పుడు కాదు. ఇది ఒకప్పటి మాట. రంగునీళ్ళ సీసాలు వచ్చి  మ్యూజియంలో బొమ్మనైపోయా. కనుమరుగైపోయా. కార్పొరేట్ కల్చర్ వచ్చి కలర్ నీళ్లు తీసుకువచ్చి నా కడుపు కొట్టేసింది. మొదట్లో మామూలు సోడాని. కాలం మారి చలువరాతి గదుల్లో దూరి కూలింగ్ సోడా అయిపోయా. చలవ చేసే నిమ్మ జాతి పండ్లతో చేరి నిమ్మ సోడా అయిపోయా. ఆ తరం అల్లరి మూక చేతిలో ఆయుధం అయిపోయా.  చివరికి ఈ తరం వాళ్లకి అపురూపమైన ...