దీపావళి అతిధి
అతిథి  వెలుగులు చిమ్ముతూ రివ్వున ఆకాశానికి ఎగిరి ఆనందం మనకు మిగిల్చి   గాల్లోనేతనువు చాలిస్తుంది ఓ తారాజువ్వ. ఆనంద యాత్రకి ఆఖరి యాత్రకి తప్పకుండా హాజరయ్యే అతిధి. పనికిరాని  పేక ముక్కతో ప్రాణం పోసుకున్న   నీనామ మే  మానవాళికి పెద్ద  అలంకారము.   ఆకాశంలో ఉండే తారలన్నీ పండగకి అతిథిగా వచ్చి మంచి ముత్యాలన్నీ మనకిచ్చి మసి  భూమికి  అంటించి. వెలుగులు చిమ్మి క్షణం లో  చేరిపోతాయి దివికి. ఎవరు కనిపెట్టారో ఈ మతాబు కితాబు ఇవ్వకుండా ఎలా ఉండగలం. గుండెల్లో దాచుకున్న  వెలుగులన్నీ దీపాల పండక్కి అందరికి పంచి ఇచ్చి తన గుండెకు చిచ్చు రగిలించుకుని గుండె బద్దలై  ప్రజల గుండెల్లో  చిచ్చుబుడ్డిగా మిగిలిపోయింది. చిటపటలాడుతూ వెలుగు విరజిమ్మే పువ్వొత్తులు  వెలిగించాయి బుడ్డి దాని కళ్ళల్లో ఒత్తులు లేని దీపాలు. అరుగుల మీద పండుగకి  వరుసగా కూర్చుని  అమావాస్యపు చీకట్లను  పారదోలి అజ్ఞానం తొలగించి పండగకి తన పేరు పెట్టుకుని వెలుగు పంచే ధన్యజీవి దీపం. దీపం లక్ష్మికి ప్రతిరూపం ఈ పండగ దీపాల పండగ. సతి తో పాటు పతి కూడా పండక్కి అతిథిగా వచ్చి విష్ణు చక్రం మై వెలుగులు పంచి సద్దుమణిగిన తర్వాత...