పోస్ట్‌లు

భాష లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

భాష

భాష  మనసులోని భావం వ్యక్తీకరించడానికి భాష ఆధారం. భాష మనుషుల్ని దగ్గర చేస్తుంది. మనస్సులను కలుపుతుంది. భాషాభివృద్ధి ఎలా జరిగిందనే విషయం ఆలోచిస్తే పూర్వం కాలంలో గురువులు ఋషులు మునులు తమ శిష్యులకి పంచ కావ్యాలు చెప్పేవారు. రాజుల కాలంలో కవులను పోషించి మంచి మంచి కావ్యాలను వ్రాయించేవారు.తదుపరి కాలంలో పాఠశాలలో తెలుగు భాషకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు.  అయితే ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించిన కాలంలో వారు కూడా మన భాష అభివృద్ధికి కొంతవరకు దోహదం చేశారని చెప్పాలి.ఏవిధంగాఅంటేభారతదేశానికివ్యాపారంకోసం వచ్చిన   తెల్ల దొరలు మన ప్రజల్ని పీడించి బాధ పెట్టినా వారు      కొన్ని రంగాలలో తీసుకొచ్చిన మార్పులు మనకు  తదుపరి కాలంలో మంచి ఫలితాలను ఇచ్చాయని చెప్పవచ్చు. ఉదాహరణకి బ్రిటిష్ వారు తీసుకొచ్చిన రైలు మార్గం తదుపరి  కాలంలో ఒక మహా సంస్థగా ఎదిగి భారతదేశానికి కోట్ల  రూపాయల్లో ఈనాడు ఆదాయం తెచ్చి పెడుతోంది. అలాగే విద్యా విధానంలో ప్రజల్లో మార్పు తీసుకురావడానికి పెద్ద బాలశిక్ష అనే గ్రంధాన్ని తెలుగులో ఆంగ్లేయులు వ్రాయించడం జరిగింది. ఇదంతా వారి స్వలాభం కోసం చేసిన మనకు ...