నవ్వు
నవ్వు మనసులోని ఆనందానికి బాహ్య సంకేతం నవ్వు. జీవoలేని నవ్వుకు అర్ధం గుండె గదిలోని గుబులు. మనసు లోని ఆనందం వరదలై పొంగితే బిగ్గరగా నవ్వు. ఒడిలోని బిడ్డ పెదవులపై వచ్చేది బోసి నవ్వు వడ్డికాసుల వాడి నవ్వు చిద్విలాసం. ఆకతాయి వాడి పెదవులపై వెకిలి నవ్వు ఆదరించేవాడు మనస్ఫూర్తిగా నవ్వు. ముదిత సిగ్గుతో తలదించుకుని ముసి ముసిగా నవ్వు. పులిస్టాప్ లేని నవ్వు మనలో లేని వాడి నవ్వు. మత్తు ఎక్కువై వచ్చే నవ్వు పేరు లేని నవ్వు. అసురుల పెదవులపై వచ్చేది వికృతమైన నవ్వు. అభయం ఇచ్చేది దేవతల నవ్వు. ముఖం మీద చెరగని చిరునవ్వు అతిథికి ఆహ్వానం ఫోటోలకు ఇచ్చే ఫోజులు మనిషికి పెంచును ఆరోగ్యo ఆనందం ఎక్కువైతే కళ్ళు కూడా తన భాషలో నవ్వుతాయి. నగుమోముకి చందమామ లాంటి అందాన్ని తీసుకొస్తాయి నవ్వు తనువుకు మంచి మిత్రువు సమయం సందర్భం లేని నవ్వు సమస్యలకు నెలవు. పెదవులపై వచ్చే చిరునవ్వు సమస్య దూరంగా జరుగు. నవ్వుతూ ఆదరిస్తే జగమంతా దరి చేరు. మూడుముక్కలాటకి అందమైన లోగిళ్ళు భూతల స్వర్గంగా మందు బాబుల క్లబ్బులు ఆ నందనవనంలో నవ్వులే పువ్వులు అవుతాయి. అదే లాఫర్స్ క్లబ్. నవ్వు ప్రాణం ఉన్న మనిషికి మాత్రమే దేవుడిచ్...