నిజ స్వరూపం
నిజ స్వరూపం సాయంత్రం ఆరు గంటలు అయ్యింది. రామారావు గారు అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి స్నానం చేసి వాలు కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో భార్య టీ కప్పు చేత పట్టుకుని భర్తకు ఇచ్చి ఎదురుగుండా కుర్చీలో కూర్చుంది. ఏవండి ఇవాళ మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి . మన రాధ ఎవర్నో ఇష్టపడిందట. అబ్బాయి మధు కూడా అదే ఆఫీసులో పని చేస్తున్నాడుట. ఇద్దరికీ మూడు సంవత్సరాల నుంచి పరిచయం. రాధ గురించి పూర్తి వివరాలు అతనికి తెలుసు. మధ్యలో ఆరోగ్యం బాగా లేకపోతే తనే హాస్పిటల్ తీసుకెళ్తుంటాడట. అబ్బాయి ఫోటో కూడా పంపించింది. అబ్బాయి కూడా మాట్లాడాడు. తనకి తండ్రి లేడని తల్లితో కలిసి ఉంటున్నాడని తన చెల్లెలికి పెళ్లి చేసి పంపించేసారని వివరాలు చెప్పాడు. ఇద్దరిదీ సమానమైన ఉద్యోగం. సమానమైన చదువు సమానమైన జీతం. ఈడు జోడు బాగానే ఉంది. కానీ వాళ్లు మన కులం కాదు ధైర్యంగా చెప్పాల్సిన మాటలు చెప్పేసింది రామారావు గారి భార్య లలిత. భార్య మాటలు విన్న తర్వాత రామారావు గారు ఆలోచనలలో పడ్డారు. తర్వాత భార్య చెప్పిన మాటలు తలకెక్కలేదు. రామారావు గారిది శుద్ధ చాందస భావాలు గల బ్రాహ్మణ కుటుంబo. రోజు గాయత్రి మంత్రం జపం చేస్తే గాని రామారావు గారు పచ్చి మంచిన...