కాకినాడ జిల్లా విహారయాత్ర
ఒకప్పుడు కాకినాడ ముఖ్య పట్టణంగా ఉండే తూ ర్పుగోదావరి జిల్లా 2022 సంవత్సరంలో జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారము కాకినాడ జిల్లా మరియు తూర్పుగోదావరి జిల్లాగా విడిపోయింది. కాకినాడ జిల్లాకి తూర్పున బంగాళాఖాత తీర ప్రాంతం, ఉత్తరాన అనకాపల్లి జిల్లా , దక్షిణాన కోనసీమ జిల్లా, పడమర తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి ఎటు చూసినా పచ్చటి పంట పొలాలు పిల్ల కాలువలు గోదావరి తీర ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రకృతి. ఇంక కాకినాడ జిల్లాలో చూడదగిన ముఖ్యమైన ప్రదేశాలు ఒక్కొక్కటి చూద్దాం.. అన్నవరం: రత్నగిరిపై వెలసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం. ప్రముఖ పుణ్యక్షేత్రం. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. స్వామివారి ప్రసాదం అత్యంత మహిమాన్వితం. మళ్లీ మళ్లీ తినాలనిపించే అమృతం. తలుపులమ్మ లోవ: తుని పట్టణానికి దగ్గరగా ఉండే ఈ తలుపులమ్మ లోవ మరొక పుణ్యక్షేత్రం. ఎవరైనా కొత్తగా వాహనాలు కొనుక్కున్నవారు తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు. పిఠాపురం: అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. అమ్మవారి పేరు పురూహుతికా దేవి. కుక్కుటేశ్వర స్వ...