కాకినాడ జిల్లా విహారయాత్ర
ఒకప్పుడు కాకినాడ ముఖ్య పట్టణంగా ఉండే
తూ ర్పుగోదావరి జిల్లా 2022 సంవత్సరంలో జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారము కాకినాడ జిల్లా మరియు తూర్పుగోదావరి జిల్లాగా విడిపోయింది.
కాకినాడ జిల్లాకి తూర్పున బంగాళాఖాత తీర ప్రాంతం, ఉత్తరాన అనకాపల్లి జిల్లా , దక్షిణాన కోనసీమ జిల్లా, పడమర తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి
ఎటు చూసినా పచ్చటి పంట పొలాలు పిల్ల కాలువలు గోదావరి తీర ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రకృతి.
ఇంక కాకినాడ జిల్లాలో చూడదగిన ముఖ్యమైన ప్రదేశాలు ఒక్కొక్కటి చూద్దాం..
అన్నవరం: రత్నగిరిపై వెలసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం. ప్రముఖ పుణ్యక్షేత్రం. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. స్వామివారి ప్రసాదం అత్యంత మహిమాన్వితం. మళ్లీ మళ్లీ తినాలనిపించే అమృతం.
తలుపులమ్మ లోవ: తుని పట్టణానికి దగ్గరగా ఉండే ఈ తలుపులమ్మ లోవ మరొక పుణ్యక్షేత్రం. ఎవరైనా కొత్తగా వాహనాలు కొనుక్కున్నవారు తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు.
పిఠాపురం: అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. అమ్మవారి పేరు పురూహుతికా దేవి. కుక్కుటేశ్వర స్వామి దేవాలయం , పాదగయ, శ్రీపాద శ్రీ వల్లభడు జన్మించిన స్థలం.
సామర్లకోట: పంచారామ క్షేత్రంలో ఒకటి. చాణుక్యల కాలంలో నిర్మించిన భీమేశ్వర స్వామి దేవస్థానం చూడదగినది.
బిక్కవోలు: లక్ష్మీ గణపతి దేవాలయం చిన్నదే గాని మహిమ కలది. ఇక్కడ స్వామి చెవిలో మన కోరికలు చెబితే తీరుస్తాడు. అలాగే సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం కూడా చాలా మహిమగలది . ప్రతి ఏటా సుబ్రహ్మణ్య షష్టికి స్వామి వారికి కళ్యాణం ఘనంగా జరుగుతుంది.
రాజమండ్రి: గోదావరి తీర ప్రాంతం, కాటన్ బ్యారేజీ, గోదావరి నదిపై అడ్డంగా నిర్మించిన రైలు బ్రిడ్జి, కోటిలింగాల గుడి, కాటన్ దొర మ్యూజియం చూడదగినవి.
కోరుకొండ: రాజమండ్రి 20 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రదేశంలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చూడదగినది.
గొల్లల మమిడాడ : అతి పురాతనమైన శ్రీరామచంద్రుడు ఆలయం చూడదగింది.
కోరంగి: ఇక్కడ ఉన్న వన్యప్రాణి అభయారణ్యం చూడదగింది.
ద్రాక్షారామం: పంచారామ క్షేత్రాల్లో ఒకటి. భీమేశ్వర స్వామి దేవాలయం.
ఇంకా అనేక ప్రదేశాలు కాకినాడ దగ్గరలో గల సర్పవరంలో ఉన్న భావనారాయణ స్వామి ఆలయం, ఉప్పాడ బీచ్, ఉప్పాడ చీరలు, పెద్దాపురం లో ఉన్న పాండవుల మెట్ట ,మరిడమ్మ దేవాలయం, కాకినాడ సముద్రం మధ్యలో ఉన్న హోప్ ఐలాండ్ ఇవన్నీ చూడదగినవి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి