పోస్ట్‌లు

నవంబర్ 6, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

కార్తీక మాసం సందడి

కార్తీకమాసం సందడి " ఏరా చిట్టి నీరసంగా ఉందా! పిల్లలు పాలు తాగొచ్చు రా మధ్యలో. అయినా మేం పెద్ద వాళ్ళు ఉంటున్నాం కదా మీకెందుకురా ఈ ఉపవాసాలు అంటూ మాటిమాటికి పేరుపేరునా పిల్లలందరినీ ఆ ప్రత్యేకమైన రోజున అడుగుతూ ఉండేది ఆ పిల్లల తల్లి సీతమ్మ. మామూలుగా అయితే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏదో ఒక చిరుతిండి నములుతూ ఉండే పిల్లలకి ఆరోజు నోరు కట్టేసినట్లు ఉండేది. ఏవి తినడానికి వీల్లేదు. పిల్లలు ఉపవాసం ఉండాలనే రూలేమీ లేదు కానీ వాళ్లు సరదా కొద్దీ ఉపవాస ఉండేవారు.ఇంతకీ ఆ ప్రత్యేకమైన రోజు ఏమిటి ?కార్తీక సోమవారం. అసలు కార్తీకమాసంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన రోజు.  కార్తీకమాసం వచ్చిందంటే చాలు బోల్డు హడావుడి ఇంట్లో. అమ్మ తెల్లవారుజామునే లేచి కార్తీక స్నానం చేసి దీపాలు పెట్టుకోవడం. దగ్గర ఉన్న గుడిలో దీపాలు పెట్టడం. నాలుగు సోమవారాలు ఉపవాసాలు. నాగుల చవితి కార్తీక పౌర్ణ మి లక్ష పత్రి పూజలు కార్తీక సమారాధనలు వనభోజనాలు అబ్బ ఒకటేమిటి చాలా సందడిగా ఉండేది మా చిన్నతనాల్లో. పెద్ద వాళ్లతో పాటు పిల్లలు కూడా ఒకపక్క ఆకలి వేస్తున్న సరదాకి ఉపవాసాలు ఉండేవాళ్ళం. ఆకలి వేస్తుంది అని చెప్పడానికి మళ్లీ అహం అడ్డు వచ్చేది. పెద్...