పోస్ట్‌లు

తోడు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

తోడు

నాన్నకు ముద్దుల బిడ్డగా వరాల మూటగా గారాల పట్టిగా నా బాల్యమంతా బంగారుమయం. అమ్మవడి దాటి బడి బాట పట్టిన నాకు చదువుల తల్లిగా నామకరణo. పసిడి మొగ్గ నైన నేను పువ్వుగా మారి పరిమళాలు వెదజల్లే భాగస్వామిని. గడప దాటి గగనం కూడా చూడని నేను ఆ ఇంటి గృహ లక్ష్మి నై వెలిగాను. ఆడబిడ్డగా జన్మించిన నా జన్మ సార్ధకం బిడ్డలకు తల్లిగా మారి అమ్మా అని పిలిపించుకోవడం అప్పటినుంచి మొదలైంది నా జీవన పోరాటం బాధ్యతాయుత జీవన సమరం కన్న వాళ్ళని ఆదర్శమూర్తులుగా పెంచాలని ఆరాటం. ఉన్నత విద్యామూర్తులుగా తీర్చిదిద్దాలని ఉబలాటం. కాలం నా పట్ల కరుణ చూపింది కన్నవాళ్లు అందరూ ఉన్నవాళ్లు అయ్యారు రంగుల కలలు కంటూ మాతృభూమి మరచి రెక్కలు వచ్చి గూడు విడిచి పరదేశం ఎగిరిపోయారు. పాలపొంగు లాంటి వయసంతా కరిగిపోయింది వృద్ధాప్యం నా శరీరం మీద దాడి చేసింది. ముడతలపడ్డ శరీరం వణికే చేతులు భారంగా మారింది నా బ్రతుకు అరణ్యరోదన అయ్యింది నా పిలుపు. తోడు గూడు దాటి వెళ్ళిపోయి ఒంటరినైపోయా  కనిపించని దైవo పిలుపు కోసం ఎదురు చూస్తూ. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.          కాకినాడ 94 91792279