బంధువులు
అవును కాలం మారింది బంధువులకి అర్థం మారింది పాత బంధువులు మరుగున పడిపోయారు కబురు కాకరకాయ లేకుండా వచ్చే బంధువులు మారిపోయారు తన రాకను ముందుగానే తెలియజేసే కొత్త బంధువులు వచ్చేసారు. ఆతిథ్యం కోరని బంధువులు రోజు మన తలుపు తడుతున్నారు. వేళా పాళా లేదు ఎండా వాన అసలే లేదు కరోనా అడ్డులేదు వేయి కళ్ళతో మన ఇల్లు వెతుక్కుని మన ఆచూకీ తెలుసుకొని అందంగా బాధ్యత నెరవేర్చే బంధువులు నెత్తి మీద టోపీ చేతిలో బరువు సంచి గేటు లోంచే బాధ్యత నెరవేర్చి వెను తిరిగే మహావీరులు. అమెజాన్ వారి అందాలబ్బాయి. రోజు మనని పలకరించే చుట్టాలు కానీ చుట్టాలబ్బాయి. మనసు పడిన మాలుని అందంగా తెచ్చి ఇచ్చే అబ్బాయి. ఆకలేసినప్పుడు అమ్మ గుర్తుకొచ్చేది. ఇప్పుడు జొమాటో తల్లి టమాటా బిర్యానీతో కడుపు నింపుతోంది. జొమాటో వీరుడు రివ్వున ఎగిరి వచ్చి ఏ వేళైనా కడుపు నింపేస్తున్నారు వీరే మన బంధువులు రోజు క్రమం తప్పకుండా మనల్ని పలకరించే మనం కలవరించే బంధువులు కాని బంధువులు. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279