పోస్ట్‌లు

జూన్ 1, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

చాట్ బండి

సాయంకాలం నాలుగు గంటలు అయితే చాలు అన్ని వయసు వాళ్ళ ఆకలి తీర్చే నాలుగు చక్రాల బండి నాలుగు వీధులలో కనబడే బండి. నలుగురు మెచ్చే మిర్చి బండి.అదే పిడత కిందపప్పు బండి. యువతను కట్టిపడేసే చాట్ బండి.  ఒకసారి సరదాగా అలా చాట్ బండి చూసి వద్దాం పదండి.ఈ బండి కి నాలుగు చక్రాలు ఉండి చుట్టూ రంగురంగుల అద్దాలడబ్బా లుతో మెరిసిపోతూ పైన ఒక స్టూలు ,కాగితoముక్కలు ఒక అరలో అలంకరించుకుని సందుల్లో గొందుల్లో పార్కు దగ్గర పాఠశాల దగ్గర ఆఫీస్ దగ్గర ఆసుపత్రి దగ్గర అందంగా నిలిచి ఉంటుంది. మన చాట్ బండి.  ఉదయం నుంచి శ్రమపడి కావాల్సిన ముడి సరుకులు తెల్లగా మల్లెపూలులా ఉండే మరమరాలు కారం ఉప్పు అటుకులు నిమ్మరసం ఉడికించిన బటాని బుల్లి సమోసాలు మిర్చి బజ్జీలు అరటికాయ బజ్జీలు వాసన వీధి అంతా అదరగొడుతుంటే ఏ మూలకైనా చేరిపోయి అందంగా నిలిచి ఉండి మంచి వాసనలతో అందర్నీఆహ్వానిస్తుంది అనేకంటే ఆకర్షిస్తుందని చెప్పడం మేలు బండి మధ్యలో ఉడుకుతున్న బటాని . కింద గ్యాస్ బండ పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఇంత సౌకర్యవంతంగా తయారుచేసిన ఈ బండి రూపశిల్పికి ముందుగా నమస్కారం.  మన ఇంట్లో కిచెన్ లో అనేక హంగులుఉంటే గ...

కన్యాదానం లో కన్నీటి ముత్యాలు

పసిపిల్లగా ఒడిలోకి వచ్చావు, పలుకలేని పలుకులతో నన్ను తడిపినావు. నిన్ను నిద్రపుచ్చేందుకు పాటలే నేర్చుకున్నా, నీ నవ్వు కోసం నేనూ చిన్న పిల్లనైపోయా. నడక నేర్పించేందుకు పట్టుకున్న చిటికెన వేళ్ళు – ఇప్పుడు నీ జీవితాన్ని నడిపించబోతున్నాయి. ఇది బాధ్యతల బంధం, ఇక్కడ అనురాగాల బంధం. మా ఇంట్లో మహాలక్ష్మిగా వెలిగిన నువ్వు, ఈరోజు మరో ఇంటికి దీపశిఖవై వెళుతున్నావు. రేపటినుండి అది నీ ప్రపంచం, మన ఇల్లు ఓ విశ్రాంతి గృహం మాత్రమే. ఇప్పటివరకు నీ కళ్ళలో వెలుగు చూసి నా గుండెల్లో కన్నీళ్లు దాచుకున్నాను. ఇన్నాళ్లు నీ గుండెలో బంధాలే ఉండేవనుకున్నా, ఇప్పుడు నీ హృదయం కొత్త బంధాలతో నిండిపోయింది కదా... మరి మేమెక్కడ? నాన్న – మగమహారాజు కాబట్టి – గంభీరంగా కనిపిస్తున్నాడు, కానీ... ఉప్పొంగే కన్నీటి కెరటాలని గుండె గదుల్లోనే అడ్డుకట్ట వేస్తూ కర్తవ్యం నిర్వహిస్తున్నా విడిపోవడం వేదన అయినా నీ సంతోషమే మా ఆనందం. కన్యాదానం పుణ్యమని  శాస్త్రం నోరు మూయించింది  దానం చేసిన దానిని అప్పగించడమే  మన విధి.  ఆడపిల్లకి జన్మనిచ్చినందుకు  తల్లితండ్రుల కర్తవ్యం  మనసు గాయపడిన  గుండె బాధపడిన  తీర్చుకోవాల్సిన...

ఆయన ఎంత అదృష్టవంతుడు

చిత్రం
కలలన్నీ తీరం చేరిన వేళ కూడా ఆ కల కంటి సముద్ర మంత ప్రేమ పెంచుకొని ఊసులు చెబుతూ హృదిని మైమరింప చేస్తూ ఛత్రము బట్టి వేసవి తాపానికి అడ్డుపెట్టి శిశిరంలో మంచు బిందువులను మాయతో పోగొట్టి వాన జల్లులలో మగనితో మమేకమై అగ్ని పుట్టించి త్రికాలములలోనూ కరుణ చూపించే పత్ని  చెంతనుండగా ఆయన ఎంత అదృష్టవంతుడు. పత్ని పరమాత్ముడు ఇచ్చిన వరం. కళత్రo లేని కాపురం ప్రత్యక్ష నరకం రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279

తాతయ్య ప్రేమ

" ఒరేయ్ తమ్ముడు! తాతయ్య చనిపోయాడుట. మావయ్య ఫోన్ చేశాడు అంటూ సరోజ ఫోన్లోనే ఏడుస్తూ పెద్ద తమ్ముడు రవికుమార్ కి ఫోన్ చేసింది. రేపు సాయంకాలం లోపు కార్యక్రమాలన్నీ చేసేస్తారుట.  "అదేమిటి ఇంత అర్ధ రాత్రి వేళ ఫోన్ చేశావు! ఒకసారి చాలా కంగారు పడ్డాను. పార్టీ నుంచి వచ్చేసరికి లేట్ అయింది .ఇప్పుడే పడుకున్నాను. అయినా రేపు నాకు ఆఫీసులో మీటింగ్లు ఉన్నాయి అంటూ సమాధానం ఇచ్చాడు చనిపోయిన పరంధామయ్య గారి కూతురు పెద్ద కొడుకు రవికుమార్. సరోజ ఇంక ఏమి మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది.    సరోజ రెండో తమ్ముడు కిరణ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమెరికాలో వాళ్ళకి ఇప్పుడు రాత్రి అవుతుందా! లేదా పగలు అవుతుందా! అని ఆలోచించకుండా ఫోన్ చేసింది సరోజ. " చాలా దురదృష్టం. నీకు తెలుసుగా నాకు ఇప్పుడు వెంటనే రావడం కుదరదు. పిల్లలకు కూడా స్కూలు ఉంది. జూమ్ లో కనెక్ట్ చూస్తే నేను తాతయ్యని చూస్తా! అని తన ప్రేమని ప్రకటించాడు కిరణ్. అయినా అంత దూరం నుంచి ఎలా వస్తాడులే అని సరిపెట్టుకుంది సరోజ. మూడో తమ్ముడు రాజు హైదరాబాదులో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తుంటాడు. సరోజి చెప్పిన కబురు విని " నీకు తెలుసుగా గవర్నమెంట్ ఆఫీస...

బామ్మ కోరిక

" ఒరేయ్ రాజు బజార్ నుంచి వచ్చేటప్పుడు ఆ మెయిన్ రోడ్ లో ఉన్న కోటయ్య కాజా తీసుకురారా. చాలా రోజులైంది తిని. మీ నాన్న బ్రతికున్న రోజుల్లో వారానికి ఒకసారైనా తీసుకొచ్చేవారు అంటూ బయటికి వెళ్లబోతున్న కొడుకు రాజారావు గారితో హాల్లో మంచం మీద కూర్చున్న 75 ఏళ్ల కామేశ్వరమ్మ గారు చెప్పారు. మీరు ఏమి తీసుకురాకండి ఆవిడకి అసలే షుగర్ . ఏదైనా రోగం వస్తే నేను చేయలేక చావాలి అంటూ కోడలు వసంత వంటింట్లోంచి గట్టిగా అరిచింది.  "ఒరేయ్ కోడలు మాటలకి ఏమి లేరా! ఏదో నామీద ప్రేమ కొద్ది అలా చెప్తుంది. నేను ఇవాళ ఎలాగైనా ఆ కోటయ్య కాజా తినవలసిందే .అబ్బా తలుచుకుంటేనే నోరూరిపోతోంది. పొట్ట నిండా పాకంతో పొట్టిగా చూడముచ్చటగా ఉంటుంది. ఎక్కువ పట్టరాకు. పిల్లలు ఎవరూ తినరు. కోడలుకి స్వీట్ ఇష్టం ఉండదు. ఇంట్లో మనిద్దరమే స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళం. అంటూ కొడుకుతో చెప్పింది కామేశ్వరమ్మ గారు. అలాగే అమ్మ పట్టుకొస్తానంటూ బయటకు వెళ్ళిపోయాడు రాజారావు గారు. ఇదేమిటి అమ్మ ఇలా రోజుకో తినుబండారం అడుగుతోంది. మొన్న ఆఫీస్ పని మీద సామర్లకోట వెళ్తున్నాను అమ్మ అంటే ఒరేయ్ అక్కడ గవ్వలు ప్రసిద్ధి రా కాసిని పట్టుకొద్దు అంటూ షాప్ అడ్రసు కూడా చెప...