ఆయన ఎంత అదృష్టవంతుడు




కలలన్నీ తీరం చేరిన వేళ కూడా
ఆ కల కంటి సముద్ర మంత ప్రేమ పెంచుకొని

ఊసులు చెబుతూ హృదిని మైమరింప చేస్తూ
ఛత్రము బట్టి వేసవి తాపానికి అడ్డుపెట్టి

శిశిరంలో మంచు బిందువులను మాయతో పోగొట్టి
వాన జల్లులలో మగనితో మమేకమై అగ్ని పుట్టించి

త్రికాలములలోనూ కరుణ చూపించే పత్ని 
చెంతనుండగా ఆయన ఎంత అదృష్టవంతుడు.
పత్ని పరమాత్ముడు ఇచ్చిన వరం.
కళత్రo లేని కాపురం ప్రత్యక్ష నరకం

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట