పోస్ట్‌లు

ఆగస్టు 22, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

భాధ్యత

ఉదయం 5 గంటలు అయింది. ఎప్పుడూ ఐదు గంటలకు కాఫీతో పలకరించే కేర్ టేకర్ లక్ష్మీ ఇవాళ ఇంకా కనపడలేదు. ఏమిటి? ఏం చేయాలి అబ్బా! బీపీ మందు వేసుకోవాలి. మొహం కూడా కడుక్కోలేదు. ఏమిటో, నీరసంగా ఉంది. ఈ అపార్ట్మెంట్లో ఎవరు పిలిచినా పలకరు. రాజేష్ ఫోన్ తీయట్లేదు. వాడు ఇంకా నిద్ర లేచాడో లేదో. ఏమిటో ఈ వయసులో ఈ కర్మ అనుకుంటూ, అలాగే నెమ్మదిగా మంచం దిగి డేకుతూ, మొహం కడుక్కుని, నేల మీద ఉన్న స్టవ్ మీద పాలు పెట్టి, కాఫీ కాచుకుని తాగింది కాంతమ్మ. "కొడుకు ఒక మంచి పని చేశాడు. ఒంటరిగా అపార్ట్మెంట్లో ఉంచినా స్టవ్ సామాన్లు కూర్చుంటే అందేలా పెట్టాడు" అని అనుకుంది కాంతమ్మ. అయినా, ఎప్పుడూ ఈ కేర్ టేకర్ ఎలా ఒంటరిగా వదిలేసి వెళ్లలేదే! ఇవాళ ఏమైందో ఏమో! మార్కెట్కు గాని వెళ్ళిందా, అయినా చెప్పి వెళ్తుంది కదా! ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. పోనీ, రాజేష్ కి విషయం చేద్దాం అంటే వాడు ఫోన్ తీయట్లేదు.  ఏమిటో, వాడు కళాకళల మనిషి. కోపంగా ఉంటే ఫోన్ తీయడు. వాడికి కోపం వస్తే, "అమ్మ" అనే సంగతి మర్చిపోతాడు. ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేది? రాజేష్ నోరు విప్పి మాట్లాడేవాడు కాదు. ఎంత బాగా చూసుకునే వారు. నేల మీద కాలు పెట్టనిచ్చేవారు కాద...

ఒక తల్లి గుండె చప్పుడు

మధ్యాహ్నం మూడు గంటలు అయింది. ఇందిరా గాంధీ లేడీస్ క్లబ్ ఆవరణ అంతా హడావిడిగా ఉంది. కార్యకర్తలంతా అటు నుంచి ఇటు తిరుగుతూ, సభ ప్రారంభానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ, ముఖ్య అతిథి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. "ఆ బ్యానర్ ఎదురుగుండా కట్టండి" అని చెప్పి ఒక్కసారి బ్యానర్ చూసిన లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్, "అదేమిటి? ముఖ్య అతిథి పేరు కింద జిల్లా కలెక్టర్ అని రాయలేదు ఏమిటి?" అని అడిగింది. "లేదు మేడం. కలెక్టర్ గారు ఒక సాధారణ మహిళగానే ఈ కార్యక్రమానికి వస్తారట. అందుకని పేరు మాత్రమే రాయమన్నారు" అంటూ సమాధానమిచ్చింది లేడీస్ క్లబ్ సెక్రటరీ. ఆ జిల్లాకి కలెక్టర్ ఆయన శ్రీమతి సుమతి. ఆ రోజు ముఖ్య అతిథి. జరగబోయే ఫంక్షన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. --- సరే, అనుకున్న సమయానికి కలెక్టర్ గారు రావడం, వేదిక మీదకి ఆహ్వానించడం, అలాగే ఆ రోజు సన్మానితులను కూడా వేదిక మీద కలెక్టర్ గారి పక్కన కూర్చోబెట్టడం జరిగింది. అతి సామాన్యమైన దుస్తులతో, ఏవీ అలంకరణలు లేకుండా, కనీసం జుట్టు కూడా దువ్వుకోకుండా ఉన్న స్త్రీని కలెక్టర్ గారి పక్కన కూర్చోబెట్టారు. ఒక్కసారి కలెక్టర్ సుమతి ఆమెను చూసి, "రోడ్డు మీద పోయే ...