పాపం సత్తయ్య
పాపం సత్తయ్య ! ఉదయం నుంచి కుండ పోతగా వర్షం పడుతోంది. రోడ్డు మీద ఎక్కడ చూసినా మోకాలు లోతు నీళ్లు. అప్పుడే నిద్ర లేచిన సత్తయ్య గబగబా గొడుగు వేసుకుని తన రేకుల షెడ్డు దగ్గరికి పరిగెత్తాడు. ఒక్కసారిగా ఆ రేకుల షెడ్డులో ఉన్న బొమ్మలు చూసేటప్పటికి సత్తయ్య గుండె గుభేలు మంది. ఆ రేకుల షెడ్ లో పూర్తిగా తయారైన వినాయకుడు బొమ్మలు ,సగం వరకు తయారైనవి, ఇంకా ముడి సరుకు రకరకాల దేవతల బొమ్మలు అన్ని నీటిలో మునిగిపోయి ఉన్నాయి. ఒకసారి సత్తయ్యకి నీరసం వచ్చేసింది. ఒక్కసారిగా నాలుగు రోజుల్లో వస్తున్న వినాయక చవితి పండుగ కోసం డెలివరీ చేయవలసిన బొమ్మలు, పుచ్చుకున్న అడ్వాన్స్ అమౌంట్లు ,షావుకారు దగ్గర ముడిసరుకు కోసం ఇవ్వవలసిన ఎమౌంటు ,అలాగే వినాయక చవితి ఉత్సవాల కమిటీ వారికి ఏం సమాధానం చెప్పాలి ?అని ఒక్కసారిగా గుర్తుకొచ్చి కళ్ళు తిరిగినట్లు అయింది. అదేమిటి మహానుభావా! పది రోజుల ముందుగానే నిమజ్జనం అయిపోయావు. పూజా పునస్కారం ఏమీ అందుకోకుండానే , వినాయక చవితి ఉత్సవాలు జరగకుండానే అనుకుంటూ వినాయకుడి ని తలుచుకుని మదన పడిపోసాగాడు సత్తయ్య. సత్తయ్య తాత తండ్రుల కాలం నుంచి బొమ్మలు తయారు చేయడమే వారి వృత్తి. రోడ్డు పక్క...