పోస్ట్‌లు

ఏప్రిల్ 15, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

బాలు

బాలు ప్రతి పాటకు అర్థం  ఆ పాట సందర్భం మీద వ్యాఖ్యానం.  ఆ రాగంలో చేసిన పాటలు.  ఆ స్వర బ్రహ్మలకు జేజేలు పాటల బ్రహ్మకు ప్రణామాలు. గళమెత్తి పాడే చిన్నారులకు అపురూపమైన సూచనలు అనంతమైన ఆశీర్వచనాలు పదుగురు మెచ్చిన ప్రోత్సాహకాలు వెరసి పాడుతా తీయగా కార్యక్రమం. రథసారథి బాలసుబ్రమణ్యం. ఇంటి పేరు లోనే ఉంది పండిత శబ్దo. ముద్దు పేరు బాలు.  ముద్దుముద్దుగా మాటలు పలుకు. భాష అంటే అభిమానం సాహిత్యం అంటే మక్కువ పాట అర్థం చేసుకుని ఆలపించడం అదే ఆయన ప్రగతికి సోపానం. కోదండపాణి గారి ప్రోత్సాహంతో సినీ రంగ ప్రవేశం. ఒకటారెండా 40 వేల పాటలు. ఏ భాషలో అయినా ఆయన గొంతు వీరంగం. అవార్డులన్నీ ఆయన మెడలో హారం. నందులన్ని బాలు గారి ఇంట్లో నివాసం శత స్కోప్ లేని డాక్టర్ బాలు బయోస్కోప్ తెచ్చింది డాక్టరేట్. పద్మశ్రీ, పద్మభూషణ్ తో సత్కారం మరణానంతరం పద్మ విభూషణతో అలంకారం. పాటలతోనే కాదు మాటలతో కూడా  మురిపించింది ఆయన గొంతు. చక్రవర్తి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో  డబ్బింగ్ కళాకారుడు గా అవతారం. ఆయన ప్రతిభకు దశావతారం సినిమా  ఒక మచ్చుతునక. మిధునం సినిమాలో అప్పదాసు పాత్ర నటనా కౌశల్యానికి మచ్చుతునక. ఒకసారి కాదు...

నడిచే దేవుడు

నడిచే దేవుడు ఉదయం 11 గంటలు అయింది  బ్యాంక్ అంతా రద్దీగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఒక కుగ్రామంలో ఉన్న ప్రముఖ జాతీయ బ్యాంకు శాఖ అది. ఇంత మారుమూల గ్రామంలో కూడా బ్యాంకు పెట్టారా! అని ఆశ్చర్యపోతారు ఎవరైనా చూస్తే. ఖాతాదారులు ఎవరు బయట నుంచి రారు. అంతా ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉండేవాళ్లే. అయితే ఆ గ్రామం ఆర్థికంగా చాలా బలమైన గ్రామం ఆ జిల్లాలో.  ప్రభుత్వం వారి పథకాలకి అనుగుణంగా బ్యాంకులు కూడా అతి సామాన్యులకు కూడా ఖాతాలు ఇవ్వడంతో దేశంలో ఏ బ్యాంకుకైనా విపరీతమైన రద్దీ పెరిగింది. ముఖ్యంగా డ్వాక్రా గ్రూపు మహిళలతో బ్యాంకులో ఏవి ఖాళీ ఉండటం లేదు. అలాగే ఆ ఊరు బ్యాంకు కూడా.  ఇంతలో ఒక తెల్ల లుంగీ పంచి పట్టుకుని పైన షర్టు వేసుకొని నుదురుతున్న బొట్టు పెట్టుకుని చేతిలో బ్యాంకు పాసుబుక్ పట్టుకుని హడావుడిగా వచ్చిన వ్యక్తిని తన గదిలోంచి సీట్లో కూర్చున్న మేనేజర్ రాఘవరావు సబ్ స్టాఫ్ ను పిలిచి ఆ వ్యక్తిని లోపలికి తీసుకురమ్మన్నాడు. ఇంతలో ఎదురు గుండా కూర్చున్న అంతే వయసు గల వ్యక్తి అదే బ్రాంచ్ కి కొత్తగా మేనేజర్ గా ఛార్జ్ తీసుకుంటున్న రామారావు   " ఎవరండీ ఆయన అని అడిగాడు రాఘవరావుని. మ...

రామ చిలుక

రామ చిలుక  పేరులో రామ శబ్దం  రంగు చూస్తే హరిత వర్ణం ముక్కు చూస్తే మిరప పండు  కుత్తుక చుట్టూ రాముడి రంగు.  నువ్వంటే మాకు ప్రాణం.  మా ప్రాణం నీలాగే ఎగిరిపోతుందని తెలియని అమాయకులం.  రామదాసు చరిత్ర తెలిసిన నిన్ను బోనులోనే బంధిస్తున్నాం. పక్షివని తెలిసినా మా భవిష్యత్తు చెప్పమని పైసలిస్తున్నాం. అందరికీ జాతకం చెప్పే  నువ్వు బోను లో ఎందుకు బందీ అవుతావు  తుర్రుమని ఎగిరిపోయి ఉండే దానివి కదా  నీ తలరాత అలా ఉంది  మా రాతని నువ్వు ఎలా చెప్పగలవు.  ఎప్పుడూ నువ్వు చెట్ల మీద ఉంటేనే అందం.  చిలకకొట్టిన జామపండు మాకు  ఎప్పుడు అది అమృతతుల్యమే. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

తరువు కోసం తనువు

తరువు కోసం తనువు ఒరేయ్ రామయ్య నువ్వు గుడిలో నాటిన మామిడి మొక్క ఈ ఏడాది ముద్దుగా కాపు కాసింది రా! అందుకే ఈ పండుని నీకు చూపించిన తర్వాతే దేవుడికి నైవేద్యం పెడదామని తీసుకొచ్చానంటూ చేతిలో మామిడిపండ్ల పళ్ళెం పట్టుకుని మొక్కలకు నీళ్లు పోస్తున్న రామయ్య దగ్గరికి వచ్చాడు గుడి పూజారి కృష్ణమాచారి.  దానికి బదులుగా రామయ్య నవ్వి నాకెందుకండీ! అయ్యగారు ఆ దేవుడికి నైవేద్యం పెట్టండి. ఆయన తోటలోనివే కదా ఇవన్నీ. కేవలం నేను ప్రతిరోజు కాసిన్ని నీళ్లు పోసాను అంతే కదా అయ్యగారు అన్నాడు రామయ్య. లేదురా ఆ మొక్కల పాలిట నువ్వు దేవుడివే. ప్రతిరోజు క్రమం తప్పకుండా శ్రమ అనుకోకుండా నీళ్లు పోసి పెంచి వాటి సంరక్షణ చూస్తావు కదా! అన్నాడు పూజారి కృష్ణమాచారి. అలా ప్రతిరోజు ఎంతోమంది "నువ్వు మా పెళ్ళిలో కానుకగా ఇచ్చిన మొక్కలు ఇప్పుడు పెరిగి పెద్దయి కాపుకు వచ్చాయి బాబాయ్ అంటూ చెప్పే ఆ ఊరి ఆడపడుచులు,  రోడ్డు పక్కన నువ్వు వేసిన మొక్కలు బాటసారులకు అలసట తీరుస్తున్నాయని కొందరు, మన పంచాయతీకి నీ మూలంగానే పర్యావరణ పరిరక్షణలో గవర్నమెంట్ వారి ప్రైజ్ ఇచ్చారని ఆ ఊరి ప్రెసిడెంట్ , హై స్కూల్ హెడ్ మాస్టర్ ఇలా ఎవరో ఒకరు చెబుతుం...

అమ్మ లేని నాన్న

అమ్మలేని నాన్న. ఉదయం ఏడు గంటలయింది. ఇంకా కొడుకు కోడలు ఎవరూ లేవలేదు. ఉదయం ఐదు గంటలకే కాఫీ తాగడం అలవాటు ఉన్న రామయ్య గారికి ఇంకా కడుపులో కాఫీ పడకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంది. ఇదే సొంత ఊర్లో అయితే ఈపాటికి రెండోసారి కాఫీ కూడా అయిపోయి ఉండేది. ఆ ఒక్క లోటు జీవితాన్ని ఎంత మార్చేసింది.ఆ లోటు ఏమిటి ఇంతకీ. ఇంకేముంది ఆ వయసులో హఠాత్తుగా భార్య సీతమ్మ గారు చనిపోవడంతో పెట్టే బేడా సర్దుకుని ఇల్లుకు తాళం వేసి ఈ నగరం చేరిపోయాడు కొడుకు దగ్గరికి. రామయ్య గారి కొడుకు కోడలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులే. ఉదయం 9 గంటలకే ఇద్దరు ఆఫీసుకి పరిగెత్తాలి. ఈలోగానే కోడలు కాఫీ టిఫిన్ వంట పూర్తి చేసి బాక్సులు పట్టుకుని రామయ్య గారికి టేబుల్ మీద అన్ని సర్దిపెట్టి ఆఫీసులకు వెళ్ళిపోతారు. రామయ్య గారి కొడుకు ఒక అపార్ట్మెంట్లో ఐదవ అంతస్తులో కాపురం ఉంటు న్నాడు. కొడుకు కోడలు ఆఫీసుకు వెళ్లిపోయిన తర్వాత రామయ్య గారు మటుకు ఇంట్లో ఏమి తోచట్లేదు. ఎంతసేపని టీవీ చూస్తాడు. ఇక్కడ ఎవరూ తెలియదు. ఏం కాలక్షేపం అవుతుంది పాపం. అయినా తప్పని పరిస్థితి. ఏం చేయలేని కుటుంబ పరిస్థితులు ఇలా ఉంది రామయ్య గారి వృద్ధాప్య జీవితం. " మావయ్య గారు గుడ్ మార్నింగ్ ...

కరోనా నెప్పులు

కరోనా నెప్పులు. ఆ వార్త విన్న దగ్గర్నుంచి చాలా ఆనందంగా ఉంది. పెళ్లయిన మూడు సంవత్సరాలకి నా చిట్టి తల్లి కడుపు పండింది . ఆనందంతో పాటు మరి కొంచెం గుండెల్లో భయం ఆందోళన కూడా తిష్ట వేసే యి. ఏమి చేయలేని పరిస్థితి. కాసిన్ని పచ్చ కాగితాలుతో జేబు నిండగానే ఇది నా ప్రయోజకత్వమే అని మురిసిపోయి గర్వపడే మానవుడు ఏమీ చేయలేకపోయాడు ఆ పరిస్థితిలో. ఏదో కంటికి కనబడని జీవి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు తాగించింది. ఎన్నో ప్రాణాలు తీసుకెళ్లి పోయింది. ఎన్నో సంసారాలు చిన్నా భిన్నం అయిపోయాయి. గుమ్మం దాటి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. ముక్కు నోరు మూసుకుని ఎవరైనా ఎదురుపడితే పక్కకు తిరిగి పారిపోయే దేశకాల పరిస్థితి. దేశం అంతా అలా ఉంటే నాకు మాత్రం ఆ వార్త ఆనందం కలిగించింది. సరే మొదటి కాన్పు. ఆ పిల్లకి భయం ఆందోళన. దానికి తోడు బయట పరిస్థితి భయంకరం. ఏ భయంకర వార్త ఆమెకు చేరకుండా ఎంత జాగ్రత్త పడిన మొహం లో అయితే ఆందోళన ఎప్పుడు కనిపిస్తూనే ఉండేది.కొన్ని నెలల్లో అమ్మగా ప్రమోషన్ వచ్చే అమ్మాయిని చంటి పిల్లలలాచూసుకోవాలి. మంచి వాతావరణం. మంచి ఆహారం. మంచి వసతి. ఇదే కదా మన పెద్దలు చెప్పిన జాగ్రత్తలు.  బజార్లోకి అడుగుపెట్...

అన్ లిమిటెడ్

అన్ లిమిటెడ్ మధ్యాహ్నం ఒంటిగంట అయింది. ఆ రెస్టారెంట్లోకి అడుగుపెట్టేటప్పటికీ ఎక్కడా ఖాళీ లేదు. ముందుగా మేము రిజర్వ్ చేసుకున్నాం కాబట్టి మేము ఎనిమిది మంది టేబుల్ ఆక్రమించేసా ము. రోజు అదే రోడ్లో అనేకసార్లు ప్రయాణిస్తుంటాం. కానీ ఎప్పుడూ తల పైకెత్తి చూడలేదు. పేరు మటుకు విన్నాం. కొత్తగా కట్టిన షాపింగ్ మాల్లో పెట్టిన రెస్టారెంట్. ఆ నగరానికి అదే మొట్టమొదటి షాపింగ్ మాల్. దానికి తోడు ఎంత తిన్నా కట్టవలసింది ఏడువందల రూపాయలు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు ఆ రెస్టారెంట్ వాడు. అందులో వెజ్ నాన్ వెజ్ రెండు దొరుకుతాయి ఆ రెస్టారెంట్ లో . మామూలు వెజిటేరియన్ మిల్స్ కి ఎంత ఖరీదైన హోటల్ లో అయినా నాలుగు వందలు మించి ఉండదు. కానీ ముక్కల కొరికే వాళ్ళకి ఆ రేటుకి అన్లిమిటెడ్ పెడుతున్నాడు అంటే భలే మంచి చౌక బేరం అనుకుంటారు.  ఏదో కొత్తగా కట్టిన షాపింగ్ మాల్ కదా కొన్నా కొనకపోయినా ఆదివారం పూట కాలక్షేపానికి పిల్లలతో పాటు వచ్చేవాళ్లు వయసు మీరిన వాళ్ళు వయసులో ఉన్నవాళ్లు ఇంక చెప్పకండి ఇంట్లో ఉన్న బామ్మ గారిని తాత గారిని కూడా బయట ప్రపంచంలో తిప్పుదామని సరదా పడే మనవలు కూడా అక్కడ ప్రతి ఫ్లోర్ తిరుగుతూ కనబడ్డ...

విశాఖపట్నం _ఇసుక కొండ

విశాఖపట్నం _ ఇసుక కొండ ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య పట్టణాల్లో సముద్ర తీర ప్రాంతమైన విశాఖపట్నం ఒకటి. ఇక్కడ అనేక పరిశ్రమలు , అందమైన బంగాళాఖాతం ఒడ్డున అందంగా తీర్చిదిద్దబడిన బీచ్, కనకమహాలక్ష్మి గుడి, పార్కులు, దగ్గరలో ఉన్న సింహాచలం, చూడకుండా ఈ ఊరు వెళ్ళిన వారు ఎవరు ఉండరు. విశాఖపట్నంలో చూడవలసిన మరొక ముఖ్యమైన ప్రదేశం పూర్ణ మార్కెట్ దగ్గర ఉన్న ఇసుక కొండమీద వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం. సాధారణంగా సత్యనారాయణ స్వామి అంటే అన్నవరం గుర్తుకొస్తుంది. అయితే ఇసుక కొండమీద ఈ దేవాలయం నిర్మించి 200 సంవత్సరములు అయింది. ఇక్కడ స్వామి కూడా అత్యంత మహిమాన్వితుడు. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి నాడు ఇక్కడ స్వామివారికి సత్యనారాయణ స్వామి వ్రతములు చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ కోరికలు తీర్చుకుంటారు భక్తజనులు. ఐదు పౌర్ణములు వరుసగా స్వామిని దర్శించి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామని మొక్కుకుంటారు. అందమైన విశాఖ నగరానికి ఇది ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. చూడవలసిన ప్రదేశం.