పోస్ట్‌లు

మాధ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మాధవుడి కాలచక్రం

మాధవుడి కాలచక్రం రాములోరి కళ్యాణం మనకు ఒక పండగ ముక్కంటి పుట్టినరోజు జన్మానికో శివరాత్రి పగలంతా ఏడు గుర్రాల రథమెక్కి ఊరేగే ఆ సూర్యుడు పుట్టినరోజు కూడా మనకు పండగే మరి ఉగాదికి ఏ దేవుడి ని పూజించాలి? చంటిగాడికి ఓ ప్రశ్న. అప్రయత్నంగా తల పైకెత్తి చూస్తే గోడమీద పాలసముద్రం మీద నిలువ నీడలా చక్రాయుధం ధరించి చిరునవ్వుతో కనబడినాడు పరమాత్మ. అది కాలచక్రం, పరమాత్మ చేతిలో తిరిగే విష్ణు చక్రం! కాదు కాదు... కాల స్వరూపమే పరమాత్మ! ఆరు ఋతువులను బండి చక్రాల్లా నడిపిస్తూ, ఆగకుండా ముందుకు కదిలించే మహానటుడు! మనల్ని మురిపించే ఆ మాధవుడు! శిశిరం వదిలి వెళ్ళిన నిరాశలను, నవ వసంతం తెచ్చి తరిమి కొడతాడు. పచ్చని ఆకులు విప్పిన నవ తరువుగా కొత్త ఆశయాలను మోసుకురావడానికి ఉగాదిగా కొత్త ఊపిరి పోస్తాడు పంచాంగం విప్పి రాబోయే కాలాన్ని తెలుపుతాడు, ఆశలను పెంచి, ఆశయాలను మొలకెత్తిస్తాడు. ఆరు రుచులను తొలిరోజే రుచి చూపించి, "జీవితమంటే ఇంతే!" అని బోధిస్తాడు. వసంతంలో వచ్చే పండుగతో తల రాతలు మారతాయని ఆశిస్తే, "వసంత రుతువు అంటే నేనే!" అంటాడు ఆ సమ్మోహనాకారుడు చంటిగాడు ప్రశ్నకు సమాధానం దొరికింది, పండగ పరమార్ధం తెలిసింది....