మానవత్వం
మానవత్వం రచన : మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279 " ఏమండీ మన సుజాత పిల్లలనీ మనం తెచ్చుకుని పెంచుకుందామా! అంటూ ఆప్యాయంగా అడిగింది భర్త రాజారావుని భార్య రాధిక. మనకు పెళ్లయ్యి మూడు ఏళ్లు అయింది కదా! రేపు మాపో మనకు కూడా పిల్లలు పుడతారు. మనకి కూడా పిల్లలు పుడితే రేపొద్దున ఈ పిల్లలందరినీ కలిపి పెంచి పెద్ద చేయగలమా అని ఆలోచిస్తున్నాను అన్నాడు రాజారావు భార్యతో. భర్త సందేహం కూడా నిజమే అనిపించింది రాధిక కి. ఏం చేయాలి ? పాపం పసివాళ్లను చూస్తే జాలేస్తుంది. సుజాత పోయిన దగ్గర నుంచి భర్త కూడా వాళ్ళని పట్టించుకోవడం మానేశాడు. సుజాత బతికున్నప్పుడు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకునేది. అంత చిన్న వయసులోనూ క్యాన్సర్ తోటి పోవడం ఏంటి ఈ పిల్లల కర్మ ఇలా కాలిపోవడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అనుకున్నారు భార్యాభర్తలు . అలా భార్యాభర్తలిద్దరికీ చాలాసేపు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. సుజాత రాజారావుకి ఒక్కగా నొక్క చెల్లెలు. భర్త రామ్ గోపాల్ తో ఇద్దరు పిల్లలతో హైదరాబాదులో చక్కగా కాపురం చేసుకుంటూ ఉండేది. ఆడపిల్...