బరువు
కడుపు కోసమే కదా కడలంతా బరువు లాగేది బరువులు తోనే  సమతుల్యంగా బతుకుబండి మోసేది  ఏ బరువు గతి తప్పిన యజమానికి చెల్లించాలి మూల్యo.  గమ్యం చేరే వరకు  బరువులతోనే  సాగుతోంది జీవి  ప్రయాణం.  ఆ బరువుల మోతల వెనుక గూడులో ఉన్నదో  బలమైన బాధ్యత. బాధ్యత అంటేనే బరువు బరువు అంటేనే  బాధ్యత. ఇన్ని బరువులు  మోసిన బక్కచిక్కి  ఉంటోంది ఆ ప్రాణం. కారే చెమట ఎదురు గాలులతో మటుమాయం. మాడుతున్న డొక్క  ,చుర్రుమనిపించే  సూరీడు తల నుండి పాదాల వరకు రక్షణ లేని శరీరo. అయినా అలుపెరగకుండా సాగుతోందా పయనం తలపులన్నీ  తలుపులు లేని గూడులో ఉన్న గువ్వల గమనం.  ఆ గువ్వల బువ్వ కోసమే ఆ బడుగు జీవి మథనం. ఎప్పుడు మారుతుందో బక్క జీవి దైనందిన జీవితం. ధనిక పేద అనే తేడా లేని సమ సమాజ నిర్మాణం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు           కాకినాడ 9491792279