వేసవి వచ్చిందంటే
వేసవి వచ్చిందంటే ఆ పూర్వీకుల పుణ్యమా అని ఇంటి వెనుక మామిడి తోటల్లో కాయ కోసుకుని ఆవకాయ పెట్టుకోవడం ఒకప్పుడు మా తల్లిదండ్రుల అదృష్టం. కాలం మారిపోయింది. ఒకప్పుడు కాకినాడ చుట్టూ ఉండే మామిడి తోటలు క్రమేపీ మాయమైపోయి ఆవకాయ కాయ కరువయ్యింది. బజార్లో బోల్డ్ కాయలు దొరుకుతాయి. వాటి పరిస్థితి అందరికీ తెలిసిందే. తోటల మధ్యలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీ లో ఆవకాయ కాయ ప్రతి ఏటా కాపు తగ్గిపో తోంది.నాణ్యమైన కాయ లేదనే చెప్పచ్చు. ఇంకేముంది రమణయ్యపేట మార్కెట్ మీద ఆధారపడి ఆవకాయ పెట్టడానికి శ్రీకారం చుట్టాము. ఖరీదు జాస్తి.నాణ్యం నాస్తి అన్నట్టుంది కాయ పరిస్థితి. ఏదో పరిస్థితికి సర్దుకుని కాలానికి తలవగ్గి ఇంటికి చేర్చాము. ఎవరింట్లో అయినా ఆవకాయ కాయ తరగడానికి కత్తిపీట మీద పెద్ద వీరుడిలా కూర్చునే మా బాబాయి గుర్తుకొచ్చాడు. పక్క వీధిలో తడికలు తయారు చేసే ఈ బాబాయిని పిలిచి తగిన మూల్యం చెల్లించి కాయి జీవితాన్ని ముక్కలు చేసి జీడి తీసి శుభ్రంగా తుడిచి ఆరబెట్టాం. అక్కడినుంచి ఆవిడ డ్యూటీ మొదలైంది. ఆ అవకాయిల ముందు ఈ ఆవకాయలు ఎంత వందల కొలది మామిడికాయలతో ఊరగాయలు పెట్టేవారు. దేవుడి ఇంట్లో చెక్క బల్ల ఊర...