పోస్ట్‌లు

అవ్వ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అవ్వ మళ్లీ పుట్టింది

అవ్వ మళ్ళీ పుట్టింది. కాలకూట విష o. ఈ పేరు తలుచుకుంటేనే వెన్నులోంచి వణుకు  పుట్టుకొస్తుంది. ఒళ్ళు జలదరిస్తుంది. పాలసముద్రంలో నుంచి పుట్టింది గాని ఏ ప్రాణి జీవితాన్ని అయినా క్షణంలో బుగ్గిపాలు  చేస్తుంది ఈ కాలకూట విషం .అటువంటి హాలాహలాన్ని గొంతులోనే బంధించాడు ఆ త్రినేత్రుడు. విచిత్రం చూడండి భగవంతుడు గొంతులో ఉన్న విష o బయటకు వదిలితే లోకానికి ప్రమాదం. సామాన్య మానవుడు విషం మింగితే ఆఖరి చుక్క వరకు బయటకు వచ్చేవరకు విశ్వ ప్రయత్నం చేస్తారు వైద్యులు. లేకపోతే ఆ మనిషి మనుగడకు ప్రమాదం.  మానవ శరీర నిర్మాణంలో గొంతు అనే భాగానికి ఉన్న ప్రాముఖ్యత చాలా ఎక్కువ. తీసుకున్న ఆహారాన్ని కడుపులోకి పంపించి మనిషి మనుగడకు చాలా సహాయం చేస్తుంది ఈ గొంతు. ఒక్కొక్కసారి తీసుకున్న ఆహారం పడక గొంతు బొంగురు పోతుంది. గొంతులో ఏదో అడ్డు పడినట్లు ఉంటుంది. అయితే ఆ బాధ నుండి విముక్తి పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం.  ఇంతకీ ఈ సమస్య గొంతుకు సంబంధించినదా. కాదు గొంతులో దాగున్న సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న శరీర భాగం. మామూలుగా పైకి కనపడదు కానీ మానవ శరీరానికి అది అతి ముఖ్యమైన శరీర భాగం. అటువంటి శరీర భాగం...